చలాన్ల ఆఫర్ కు భారీ స్పందన.. రుసుముల చెల్లింపునకు పోటీ.. ఒత్తిడికి సర్వర్లు హ్యాంగ్

వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Telangana Traffic police) అమలు చేస్తున్న రాయితీ ఐడియాకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ తో ఇలాంటి...

చలాన్ల ఆఫర్ కు భారీ స్పందన.. రుసుముల చెల్లింపునకు పోటీ.. ఒత్తిడికి సర్వర్లు హ్యాంగ్
Traffic Challans
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 01, 2022 | 7:21 PM

వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను వసూలు చేసుకునేందుకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు(Telangana Traffic police) అమలు చేస్తున్న రాయితీ ఐడియాకు భారీ స్పందన వస్తోంది. ప్రభుత్వం కల్పించిన ఆఫర్ తో ఇలాంటి సమయంలోనే తమ చలాన్లను(Challans) క్లియర్ చేసుకోవాలని భావిస్తున్నారు. చలాన్లు కట్టేందుకు వాహనదారులు భారీగా రావడంతో.. సర్వర్ పై ఒత్తిడి పెరిగింది. దీంతో సర్వర్ లో సాంకేతిక సమస్యలు(Technical Problems in Survers) తలెత్తి, సేవలు నిలిచిపోయాయి. ఆఫర్ ప్రారంభమైన నాటి నుంచి వెబ్ సైట్ ద్వారా రుసుములు చెల్లించేందుకు వాహనదారులు పోటీ పడుతున్నారు. చలాన్ల చెల్లింపు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రావటంతో తొలి 8 గంటల్లోనే లక్షా 77వేల చలానాలను వాహనదారులు క్లియర్​చేశారు. వీటి ద్వారా రూ.కోటి 77లక్షలు వచ్చాయి. ఇప్పటివరకు 5 లక్షల చలాన్లు క్లియర్ అయినట్లు అధికారులు తెలిపారు. చలాన్ల  విలువ రూ.20 కోట్లు అంటే రాయితీ పోనూ..రూ.5 కోట్లు వసూలయ్యాయని వెల్లడించారు.  ఈ నెల 31 వరకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. వెబ్​సైట్​లోనూ ఈ విషయాన్ని పొందుపరిచారు.  వాహనదారులు తమ చలానాలను ట్రాఫిక్‌ ఈ-చలానా వెబ్‌సైట్‌, ట్రాఫిక్ పోలీస్‌ వెబ్‌సైట్‌, నేరుగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి చెల్లించవచ్చు. వెబ్‌సైట్లలో లోక్‌అదాలత్ ఆప్షన్‌ను ఎంచుకోగానే.. రాయితీ పోనూ కట్టాల్సిన సొమ్మును చూపిస్తుంది. ట్రాఫిక్ పోలీసుల వెబ్​సైట్​తో పాటు మీ సేవలో చలాన్లు చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. సాంకేతిక సమస్య తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు సర్వర్ల సామర్థ్యం పెంచారు. యూపీఐ డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా చెల్లింపులు చేసేలా ఏర్పాట్లు చేశారు.

తెలంగాణ ట్రాఫిక్‌ పోలీసులు.. వాహనదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ట్రాఫిక్‌ చలానాలపై అధికారులు భారీ ఆఫర్‌ ప్రకటించారు. ప్రతి రోజు ఎంతో మంది నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో ట్రాఫిక్‌ చలనాలు (Traffic Charlatans) పడుతున్నాయి. కొంత మందికి వేలల్లో ఉంటాయి. అలాంటి వారికి భారీ ఉపశమనం కలిగిస్తోంది తెలంగాణ (Telangana) ట్రాఫిక్‌ పోలీసు శాఖ. ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలలో అధికంగా ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులే ఉండే అవకాశం ఉంది. హెల్మెట్లు ధరించకపోవడం, ఓవర్‌ స్పీడ్‌ లాంటి చలానాలే అధికం ఉంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అధికారులు వాహనదారులకు భారీ ఊరట కలిగించారు. వాహనాదారులు పెండింగ్‌లో ఉన్న చలానాల మొత్తంలో 25 శాతం మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. అంటే 75శాతం రాయితీ ఉంటుంది. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ట్రాఫిక్ చలానాల రాయితీలు అమల్లోకి వచ్చాయి.

ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 75 శాతం, కార్లు, లారీలకు 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 70శాతం, తోపుడు బండ్లకు 80 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించే అవకాశాన్ని పోలీసులు కల్పించారు. కొవిడ్ నిబంధనల్లో మాస్క్ ధరించని వారికి విధించిన జరిమానాల్లో 90 శాతం రాయితీ కల్పించారు. రాష్ట్రవ్యాప్తంగా 1750 కోట్ల రూపాయల చలాన్లు పెండింగ్ ఉన్నాయి.

Also Read

Maha Shivaratri: హర హర మహాదేవ శంభో శంకర.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..

Avika Gor Photos: విరబూసిన ఎర్రటి ముద్దమందారంలా కొంటె చూపులు చూస్తున్న చిన్నారి పెళ్లికూతురు.. అవికా గోర్ ఫొటోస్…

Actor Sunil: హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేసిన సునీల్.. ఈసారి పోలీస్ పాత్రలో మరింత పవర్‌ఫుల్‌ గా..