త్వరలో ప్రభుత్వం ఏర్పాటు.. “మహా” పోరులో బీజేపీ ట్విస్ట్..!
“మహా” రాజకీయాలు గంటకో తీరు మారుతున్నాయి. ఫలితాలు వచ్చి.. దాదాపు ఇరవై రోజులు అయినా ప్రభుత్వం ఏర్పాటు కాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కేంద్ర క్యాబినెట్‌కు సిఫారసు చేయడం.. ఆ తర్వాత దానిని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పడం.. అంతా చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే కేంద్ర క్యాబినెట్ తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి […]
“మహా” రాజకీయాలు గంటకో తీరు మారుతున్నాయి. ఫలితాలు వచ్చి.. దాదాపు ఇరవై రోజులు అయినా ప్రభుత్వం ఏర్పాటు కాని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ కేంద్ర క్యాబినెట్‌కు సిఫారసు చేయడం.. ఆ తర్వాత దానిని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం చెప్పడం.. అంతా చకచకా జరిగిపోయాయి. ఆ వెంటనే కేంద్ర క్యాబినెట్ తీర్మానంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోదముద్ర వేయడంతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీంతో ఆరు నెలల పాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉండనుంది. అయితే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయకాకపోతే.. ఎన్నికలు తప్పనిసరి కానున్నాయి. ఒకవేళ ఈ మధ్యలో ప్రభుత్వం ఏర్పాటు జరిగితే.. రాష్ట్రపతి పాలన తొలగిస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.
అయితే ఈ సందర్భంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనపై మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన దురదృష్టకరమని అన్నారు. అంతేకాదు.. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే ఎవరి మద్దతుతో అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. బీజేపీకి చెందిన మరో సీనియర్ నేత నారాయణ్ రాణే కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. త్వరలో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు వ్యాఖ్యలు చేశారు.
కాగా, మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో.. బీజేపీ 105 స్థానాల్లో విజయం సాధించగా.. శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 చోట్ల గెలుపొందాయి. 29 చోట్ల స్వతంత్రులు గెలిచారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన 145 మంది ఎమ్మెల్యేల బలం ఏ పార్టీకీ లేదు. అయితే కూటమిగా ఉన్న శివసేన-బీజేపీ అధికారం చేపట్టేందుకు కావాల్సినంత బలం ఉన్నా.. సీఎం పీఠం విషయంలో విభేధాలు వచ్చి విడిపోయాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనైనా సీఎం పీఠం అధిష్టించాలని మొండిపట్టుతో ఉన్న శివసేన.. ఎన్సీపీ-కాంగ్రెస్ మద్దతిస్తాయని ఆశించి భంగపడింది. దీంతో మొదటికే మోసం వచ్చినట్లైంది. ఇదే సమయంలో శివసేనతో ఎన్సీపీ-కాంగ్రెస్ చేతులు కలిపేందుకు వెనకడుగు వేస్తుండటాన్ని గమనించిన కమలదళం.. మళ్లీ రంగంలోని దిగినట్లు తెలుస్తోంది. శివసేన నేతలతో మళ్ళీ బీజేపీ సంప్రదింపులు చేపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే.. త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ప్రకటించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Former Maharashtra CM Devendra Fadnavis in a press note: President’s rule is unfortunate but we expect that Maharashtra will get a stable government soon. (file pic) pic.twitter.com/Mwl62YoRfj
— ANI (@ANI) November 12, 2019