AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prashant Kishor: 18 నెలల.. 3500 కి.మీటర్లు.. ఇవాళ్టి నుంచి ‘జన్‌ సురాజ్‌’ పాదయాత్రకు ప్రశాంత్‌ కిశోర్‌ శ్రీకారం..

ప్రశాంత్‌ కిశోర్‌ ‘జన్‌ సురాజ్‌’ ప్రచారం కోసం బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ఇవాళ ఆయన ఈ యాత్రను..

Prashant Kishor: 18 నెలల.. 3500 కి.మీటర్లు.. ఇవాళ్టి నుంచి ‘జన్‌ సురాజ్‌’ పాదయాత్రకు ప్రశాంత్‌ కిశోర్‌ శ్రీకారం..
Prashant Kishor Padayatra
Sanjay Kasula
|

Updated on: Oct 02, 2022 | 11:14 AM

Share

రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ‘జన్‌ సురాజ్‌’ ప్రచారం కోసం బిహార్‌లో 3,500 కి.మీ. పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని పశ్చిమ చంపారన్‌ జిల్లాలో ఇవాళ ఆయన ఈ యాత్రను ప్రారంభిస్తారు. 1917లో మహాత్మాగాంధీ మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించిన భితిహర్వా నుంచి పీకే శ్రీకారం చుట్టనున్నారు. ఇది 12 నుంచి 18 నెలల పాటు సాగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించడానికి ఇది ముందస్తు కసరత్తుగా చెబుతున్నారు. ఎలాంటి విరామం లేకుండా సాగనున్న యాత్రలో ప్రతీ పంచాయతీకి ఆయన వెళ్తారు. ప్రశాంత్ కిషోర్, తన జన్ సూరజ్ ప్రచారంలో భాగంగా, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పశ్చిమ చంపారన్ జిల్లా నుండి బీహార్ వరకు 3500 కిలోమీటర్ల “పాదయాత్ర” ప్రారంభించారు. ప్రశాంత్ కిషోర్ వేద మంత్రోచ్ఛారణలతో జన్ సూరజ్ యాత్రను ప్రారంభించారు.

ప్రశాంత్ కిషోర్ ఈ ప్రయాణం 12 నుంచి 18 నెలల పాటు సాగుతుంది. దీని తర్వాత ఆయన తాజాగా రాజకీయ రంగంలో అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, ప్రశాంత్ కిషోర్ మాత్రం ఇలాంటి నిర్ణయాన్ని ప్రచారంలో తనతో జతకట్టే వారే తీసుకోగలరని తరచూ చెప్పడం విశేషం. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ 2018లో జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ)లో చేరారు. అయితే ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను బహిరంగంగా విమర్శించినందుకు 2020లో పార్టీ నుంచి బహిష్కరించబడ్డారు. ముఖ్యంగా సవరించిన పౌరసత్వ చట్టానికి నితీష్ కుమార్ మద్దతు ఇచ్చినప్పుడు, ప్రశాంత్ కిషోర్ అతనిని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ యాత్రలో ప్రతి పంచాయతీ, బ్లాక్‌ కేంద్రంగా పాదయాత్ర సాగనుంది. బీహార్ రాష్ట్రంలోని అన్ని గ్రామాలను టచ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 

పశ్చిమ చంపారన్‌లోని భితిహర్వాలోని గాంధీ ఆశ్రమం నుంచి ప్రశాంత్ కిషోర్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. జాతిపిత మహాత్మా గాంధీ 1917లో ఇక్కడి నుంచే తన మొదటి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ యాత్రలో మూడు ప్రధాన లక్ష్యాలు ఉన్నాయని, వాటిలో అట్టడుగు స్థాయిలో సరైన వ్యక్తులను గుర్తించడం. వారిని ప్రజాస్వామ్య వేదికపైకి తీసుకురావడం కూడా ఉన్నాయని ప్రకటన పేర్కొంది. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, పరిశ్రమలతో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణుల అభిప్రాయాలను పొందుపరిచి యాత్ర రాష్ట్రానికి విజన్ డాక్యుమెంట్‌గా కూడా పని చేస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం