WDC-PMKSY: అన్నదాతలకు మరో శుభవార్త.. రూ.700 కోట్లతో 56 ప్రాజెక్టులకు శ్రీకారం
రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు, అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఈ ప్రాజెక్ట్‌లో చేపట్టిన కార్యకలాపాలలో రిడ్జ్ ఏరియా ట్రీట్‌మెంట్, డ్రైనేజీ లైన్ ట్రీట్‌మెంట్, మట్టి, తేమ సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, నర్సరీ పెంపకం, పచ్చిక బయళ్లను అభివృద్ధి చేయడం, ఆస్తి లేని వ్యక్తులకు జీవనోపాధి మొదలైన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
రైతులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మకర సంక్రాంతి కానుకగా మరో గుడ్‌న్యూస్ చెప్పారు. 700 కోట్ల విలువైన 56 ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ 56 కొత్త ప్రాజెక్టులకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ (MORD) ఆమోదం తెలిపింది. దేశంలోని బంజరు, వర్షాధార ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. ఈ పథకంలోకి పది రాష్ట్రాలను చేర్చింది కేంద్ర ప్రభుత్వం. రూ.700 కోట్లతో ఈ రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు, అస్సాం, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. ఈ ప్రాజెక్ట్‌లో చేపట్టిన కార్యకలాపాలలో రిడ్జ్ ఏరియా ట్రీట్‌మెంట్, డ్రైనేజీ లైన్ ట్రీట్‌మెంట్, మట్టి, తేమ సంరక్షణ, వర్షపు నీటి సంరక్షణ, నర్సరీ పెంపకం, పచ్చిక బయళ్లను అభివృద్ధి చేయడం, ఆస్తి లేని వ్యక్తులకు జీవనోపాధి మొదలైన కార్యక్రమాలను చేపట్టనున్నారు.
WDC-PMKSY ద్వారా, ఇది మెరుగైన సహజ వనరుల నిర్వహణ , వాతావరణ మార్పుల పట్ల రైతులకు మంచి అవగాహన ద్వారా స్థిరమైన అభివృద్ధిని నిర్ధారించడానికి ప్రయత్నిస్తుంది. 2021-22 సంవత్సరంలో, WDC-PMKSY 2.0 కింద రూ. 12,303 కోట్లతో దాదాపు 50 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో 1150 ప్రాజెక్టులు ఆమోదించింది కేంద్రం. WDC-PMKSY 1.0 కింద పూర్తి చేసిన ప్రాజెక్టుల మూల్యాంకనం భూగర్భ జలమట్టంలో గణనీయమైన మెరుగుదల, ఉపరితల నీటి లభ్యత పెరుగుదల, పంట ఉత్పాదకత, రైతుల ఆదాయంలో మెరుగుదలని వెల్లడించింది.
ఈ పథకం కోసం ప్రభుత్వం 5,000 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టనుంది. మైదానాల్లోనూ అలాగే ఉంచుతారు. అయితే, కొండ ప్రాంతాలలో ఇది తగ్గవచ్చు. దాదాపు 2.8 లక్షల హెక్టార్లను కవర్ చేయడానికి మొత్తం రూ.700 కోట్లను కేటాయించడం ద్వారా ఈ పథకం ప్రభావాల ఆధారంగా దాని పనులకు ప్రాధాన్యతనిస్తుంది. ఇది సకాలంలో పాడుబడ్డ భూమిని రికవరీ చేయడానికి, డబ్బు సరైన వినియోగం అవుతుందని సర్కార్ భావిస్తోంది. ఈ ప్రాజెక్టులు రైతుల ఆదాయాన్ని పెంచడానికి, భూమి క్షీణతను పరిష్కరించడానికి, వాతావరణ స్థితిస్థాపకత ప్రయత్నాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..