త్వరలో హిమాలయన్ ప్రాంతానికి పొంచి ఉన్న భూకంపం ముప్పు..జీయోలాజీ శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు

ఇటీవల ఉత్తర అఫ్గానిస్థాన్ ప్రాంతంలో వచ్చిన భూకంగా తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 6.6 మ్యాగ్నిట్యూట్ తో భూమి కంపించడంతో ఈ తీవ్రత ఉత్తర భారతదేశానికి వ్యాపించింది.

త్వరలో హిమాలయన్ ప్రాంతానికి పొంచి ఉన్న భూకంపం ముప్పు..జీయోలాజీ శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు
Earthquake
Follow us

|

Updated on: Mar 23, 2023 | 12:34 PM

ఇటీవల ఉత్తర అఫ్గానిస్థాన్ ప్రాంతంలో వచ్చిన భూకంగా తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 6.6 మ్యాగ్నిట్యూట్ తో భూమి కంపించడంతో ఈ తీవ్రత ఉత్తర భారతదేశానికి సైతం వ్యాపించింది. అలాగే పాకిస్తాన్, ఖజకిస్థాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాలు కూడా భూకంప ప్రభావాన్ని చవిచూశాయి. ఈ ఏడాది మార్చిలో సుమారు ఆరు భూకంపాలు సంభవించాయి. ఇవ్వన్నీ కూడా రిచర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4 కన్న ఎక్కవగానే నమోదయ్యాయి. దీంతో ఇంతకన్న ప్రమాదకరమైన భూకంపాలు భారత్ లో మరిన్ని రానున్నాయా అని ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో వాడియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జీయోలాజి శాస్త్రవేత్త డాక్టర్ అజయ్ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఎప్పుడైనా హిమాలయన్ ప్రాంతాల్లో మరో శక్తివంతమైన భూకంపం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. భూకంపాల ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల ప్రజలను రక్షించవచ్చని తెలిపారు. అలాగే టెక్టోనిక్ ప్లేట్లు శక్తిని విడుదల చేసినప్పుడు భూకంపాలు వస్తాయని అంచనా వేయడం సాధ్యం కాదని తెలిపారు.ఇదిలా ఉండగా భూకంప ధాటికి అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ లో సుమారు 12 మంది మరణించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..