Police: దొంగను పట్టుకునేందుకు పండ్లు, కూరగాయలు అమ్మి, నిరాశ్రయులుగా నటించిన పోలీసులు..ఎక్కడంటే
కొంతమంది నిందుతుల్ని వెతికి పట్టుకునేందుకు పోలీసు నానా తంటాలు పడుతుంటారు. కొనిసార్లైతే పోలీస్ యూనిఫామ్ లో కాకుండా మారువేషాల్లో కూడా గాలిస్తారు. ఈ క్రమంలోనే ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా పండ్లు, కూరగాయల విక్రయించారు.

కొంతమంది నిందుతుల్ని వెతికి పట్టుకునేందుకు పోలీసు నానా తంటాలు పడుతుంటారు. కొనిసార్లైతే పోలీస్ యూనిఫామ్ లో కాకుండా మారువేషాల్లో కూడా గాలిస్తారు. ఈ క్రమంలోనే ఓ దొంగను పట్టుకునేందుకు పోలీసులు ఏకంగా పండ్లు, కూరగాయల విక్రయించారు. నిరాశ్రయులుగా నటించారు. అలాగే ఆటోలు కూడా నడిపారు. ఇలా దాదాపు 15 రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు దొంగను పట్టుకున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఈ వ్యవహారం చోటుచేసుకుంది.
అంబివలీ ప్రాంతానికి చెందిన అబ్బస్ అమ్జద్ ఇరానీ (24) అనే ఓ పాత నేరస్థుడు పలు చోరిలు చేశాడు. అతని పై ఎన్నో కేసులు ఉన్నప్పటికీ తప్పించుకు తిరుగుతున్నాడు. ఆ నిందితుడి ఆచూకి తెలిసినప్పటికీ..అరెస్టు చేసేందుకు వెళ్తే స్థానికుల వల్ల పోలీసులపైనే దాడులు జరిగేవి. దీంతో పోలీసులు ఓ ఆపరేషన్ ను ప్రారంభించారు. దాదాపు రెండు వారాల పాటు మారువేషాల్లో తిరుగుతూ ఇరానీపై నిఘా ఉంచారు. చివరికి అతను ఒంటరిగా దొరికినప్పడు పట్టుకోని ఆటోలో పోలీస్ స్టేషన్ కు తరలించారు. 21 కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇరానీ అరెస్టుతో జిల్లాలో ఏడు గొలుసు చోరీల కేసులు పరిష్కారమైనట్లు పోలీసులు పేర్కొన్నారు.




మరిన్ని జాతీయ వార్తల కోసం
