Chandigarh University: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో కీలక మలుపు.. బాంబే ఐఐటీలో ఒకరు అరెస్టు..

విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేశారన్న ఘటనలో చండీగఢ్ యూనివర్సిటీలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో హాస్టల్‌లో ఉన్న ఓ విద్యార్థినిని వీడియో తీసినందుకు క్యాంటీన్‌లో...

Chandigarh University: చండీగఢ్ యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో కీలక మలుపు.. బాంబే ఐఐటీలో ఒకరు అరెస్టు..
SI Arrested
Follow us

|

Updated on: Sep 20, 2022 | 7:40 PM

విద్యార్థినుల వీడియోలు సోషల్ మీడియాలో లీక్ చేశారన్న ఘటనలో చండీగఢ్ యూనివర్సిటీలో పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో హాస్టల్‌లో ఉన్న ఓ విద్యార్థినిని వీడియో తీసినందుకు క్యాంటీన్‌లో పని చేసే ఓ ఉద్యోగిని ఐఐటీ బాంబేలో అరెస్టు చేశారు. వర్సిటీకి చెందిన విద్యార్థిని బాత్రూమ్ కిటికీ వెలుపల మొబైల్ ఫోన్‌ను గుర్తించింది. ఆమె వెంటనే అప్రమత్తమై హాస్టల్ కౌన్సిల్ అధికారులను అలర్ట్ చేసింది. అనంతరం విషయాన్ని యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. ఆమె కంప్లైంట్ ఆధారంగా అధికారులు అతణ్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కెమెరాను గుర్తించిన విద్యార్థిని వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి కళాశాల అధికారులకు సమాచారం అందించింది. హాస్టల్ భవనం బయట ఉన్న CCTV ఫుటేజీని ఆధారంగా వివరాలు సేకరించేందుకు ప్రయత్నించగా.. కెమెరాలు పగిలిపోవడంతో దృశ్యాలను స్కాన్ చేయడం సాధ్యపడలేదు. మధ్యాహ్నం 3:30 నుంచి తెల్లవారుజామున 3 గంటల వరకు ఐదుగురు సిబ్బందిని పోవై పోలీస్ స్టేషన్‌లో విచారించారు. వీరిలో ఒకరిని విచారించిన తర్వాత భారతీయ శిక్షాస్మృతి (IPC) కింద అరెస్టు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

కాగా.. చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది విద్యార్ధినుల న్యూడ్ వీడియోలు లీకయ్యాయంటూ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. యూనివర్సిటీ అధికారుల తీరును నిరసిస్తూ విద్యార్ధులు నిరసనలు చేపడుతున్నారు. విద్యార్ధినులు స్నానాలు చేస్తున్న దృశ్యాలను సోషల్ మీడియాలో వైరల్ చేశారని ఆరోపిస్తున్నారు. వైరల్‌ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పరిస్థితి అదుపు తప్పడంతో రెండు రోజుల పాటు యూనివర్సిటీకి సెలవులు ప్రకటించారు. యూనివర్సిటీ విద్యార్ధినిల వీడియోలు ఒక్కటి కూడా వైరల్‌ కాలేదని అధికారులు, పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

మరోవైపు.. ఎవరి వీడియోలు లీక్ కాలేదని యూనివర్సిటీ అధికారులు వివరణ ఇచ్చారు. తన బాయ్ ఫ్రెండ్‌తో అమ్మాయిల నగ్న వీడియోలు షేర్ చేసుకుందని ఆరోపణలు ఎదుర్కొంటున్న అమ్మాయి ఫోన్‌లో ఎవరి వీడియోలు లేవని ప్రొ- ఛాన్సలర్ ఆర్ఎస్ బావా స్పష్టం చేశారు. విద్యార్థినుల వీడియోల వైరల్‌ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని మొహలీ ఎస్పీ వివేక్‌ సోని చెప్పారు. అయితే యూనివర్సిటీలో ఎవరు ఆత్మహత్యాయత్నం చేయలేదని వివరించారు. పంజాబ్‌ ప్రభుత్వం ఆదేశించిన ఉన్నత స్థాయి దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తలు చదవండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.