Delhi Pollution: పంట వ్యర్థాల కాల్చివేతకు చెక్‌ పెట్టేందుకు కొత్త పద్దతి.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం

Delhi Govt on Pollution: ఢిల్లీలో వాతావరణం కాలుష్యం కాకుండా చూడడానికి పంట వ్యర్థాలపై బయో డీ కంపోజర్‌ను చల్లాలని నిర్ణయించారు. ఢిల్లీ శివార్లలో 5000 ఎకరాల్లో..

Delhi Pollution: పంట వ్యర్థాల కాల్చివేతకు చెక్‌ పెట్టేందుకు కొత్త పద్దతి.. ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Delhi
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 20, 2022 | 7:48 PM

పంట వ్యర్థాల కాల్చివేతపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో వాతావరణం కాలుష్యం కాకుండా చూడడానికి పంట వ్యర్థాలపై బయో డీ కంపోజర్‌ను చల్లాలని నిర్ణయించారు. ఢిల్లీ శివార్లలో 5000 ఎకరాల్లో బయోడికంపోజర్‌ను చల్లుతారని తెలిపారు ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్‌రాయ్‌. అక్టోబర్‌ మొదటి వారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.  పంట వ్యర్థాల కాల్చివేతకు ప్రత్యామ్నాయంగా బయోడికంపోజర్‌ను వాడాలని చాలా రోజుల నుంచి ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ పంట వ్యర్థాల కాల్చివేతను అడ్డుకోవడానికి ఈ విధానాన్ని రూపొందించింది. దీంతో వాతావరణ కాలుష్యాన్ని బాగా నివారించవచ్చు. డీకంపోజర్‌ను ఉపయోగించడానికి రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది ఢిల్లీ ప్రభుత్వం. గతంలో రైతులకు ఉచితంగా బయో డికంపోజర్‌ స్ప్రేను అందించేవారు.

గత రెండేళ్ల నుంచి ఢిల్లీ ప్రభుత్వం ఇండియన్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి క్యాప్సూల్‌ను కొనుగోలు చేసి రైతులకు అందిస్తోంది. క్యాప్సూల్‌ను బెల్లం, శనగపిండితో కలిపి పంట వ్యర్థాలపై చల్లాలని సూచించేవారు. కాని ఈసారి మాత్రం నేరుగా ఆ సంస్థ నుంచి మిశ్రమాన్ని కొనుగోలు చేస్తున్నారు.

పంజాబ్‌లో ప్రయోగాత్మకంగా బయో డీ కంపోజర్‌ను ఉపయోగించారు. పంటసాగుకు.. కోతలకు ఈసారి చాలా తక్కువ సమయం ఉందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ విధానాన్ని ఉపయోగించేందుకు కోతల తరువాత 15 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు.

అందుకే పంట వ్యర్థాల కాల్చివేత తరువాత ఢిల్లీలో భారీగా కాలుష్యం పెరుగుతోంది. అందుకే దీనికి అడ్డుకట్ట వేయడానికి రైతులకు బయో డీ కంపోజర్‌ను అందించాలని నిర్ణయించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం

గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో