సెమికాన్ ఇండియా 2025ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ.. 2,500 మంది విదేశీ ప్రతినిధులు హాజరు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో 'సెమికాన్ ఇండియా 2025'ను ప్రారంభిస్తారు. నేటి నుండి సెప్టెంబర్ 4 వరకు జరిగే ఈ సమావేశం భారతదేశంలో బలమైన, దృఢమైన, స్థిరమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుంది. ఈ సమావేశాలకు 48 దేశాల నుండి 2500 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (సెప్టెంబర్ 2) సెమికాన్ ఇండియా-2025ను ప్రారంభిస్తారు. ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని యశోభూమిలో జరిగే ఈ సమావేశం లక్ష్యం భారతదేశ సెమీకండక్టర్ రంగాన్ని ప్రోత్సహించడం. ప్రధాని మోదీ బుధవారం కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీఈఓ రౌండ్‌టేబుల్‌లో పాల్గొంటారు.
ఈ మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాలకు 48 దేశాల నుండి 2500 మంది ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సెమినార్ ద్వారా భారతదేశంలో బలమైన, దృఢమైన, స్థిరమైన సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తుందని ప్రధానమంత్రి కార్యాలయం ఓ ప్రకటన పేర్కొంది.
సెమికాన్ ఇండియా ప్రోగ్రామ్ పురోగతి, సెమీకండక్టర్ ఫ్యాబ్, అధునాతన ప్యాకేజింగ్ ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాల సంసిద్ధత, స్మార్ట్ తయారీ, పరిశోధన, అభివృద్ధిలో ఆవిష్కరణ, కృత్రిమ మేధస్సు, పెట్టుబడి అవకాశాలు, రాష్ట్ర స్థాయి విధానం అమలు మొదలైన అంశాలపై సెషన్లు నిర్వహించడం జరుగుతుందని పీఎంవో ప్రకటన తెలిపింది. అదనంగా, ఈ కార్యక్రమం డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ (DLI) పథకం కింద చొరవలు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి, అంతర్జాతీయ సహకారాలు, భారతదేశ సెమీకండక్టర్ రంగానికి భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌పై చర్చించనున్నారు.
దేశరాజధానిలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో 48 కంటే ఎక్కువ దేశాల నుండి 2,500 కంటే ఎక్కువ మంది ప్రతినిధులు, 50 కంటే ఎక్కువ మంది ప్రపంచ ప్రముఖులు, 150 కంటే ఎక్కువ మంది వక్తలు, 350 మంది కంటే ఎక్కువ మంది ప్రదర్శనకారులు సహా 20,750 మందికి పైగా పాల్గొననున్నారు. ఇందులో ఆరు దేశాల రౌండ్ టేబుల్ చర్చలు ఉంటాయి. శ్రామిక శక్తి అభివృద్ధి, స్టార్టప్‌ల కోసం కంట్రీ పెవిలియన్‌లు, ప్రత్యేక పెవిలియన్‌లు కూడా ఉంటాయి.
సెమీకండక్టర్ డిజైన్, తయారీ, సాంకేతిక అభివృద్ధికి భారతదేశాన్ని ఒక కేంద్రంగా ప్రదర్శించాలనే ప్రధానమంత్రి దార్శనికతను ముందుకు తీసుకువెళుతూ, 2022లో బెంగళూరులో, 2023లో గాంధీనగర్‌లో, 2024లో గ్రేటర్ నోయిడాలో సమావేశాలు జరుగాయని ప్రకటన పేర్కొంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల జపాన్ పర్యటన సందర్భంగా, భారతదేశం-జపాన్ 21 ముఖ్యమైన ఒప్పందాలపై సంతకం చేశాయి. వీటిలో సెమీకండక్టర్లు, AI రంగంలో సహకారం ప్రముఖమైనది. ఈ పర్యటన సందర్భంగా, ప్రధాని మోదీ టోక్యో ఎలక్ట్రాన్ యొక్క సెమీకండక్టర్ ప్లాంట్‌ను సందర్శించారు. అధునాతన సాంకేతికతపై వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. సెమీకండక్టర్ పరికరాలు, సామగ్రిలో జపాన్‌ను ప్రపంచ నాయకుడిగా పరిగణిస్తారు. భారతదేశం-జపాన్ ఒప్పందంలోని ఒక అంశం ఏమిటంటే, జపాన్ సాంకేతిక పరిజ్ఞానాల తయారీని భారతదేశానికి బదిలీ చేయాలి. తద్వారా చైనాపై ఆధారపడటం తగ్గించవచ్చు, ఆర్థిక భద్రతను పెంచవచ్చు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




