PM Narendra Modi: ప్రధాని చేసిన పనికి సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతోన్న కాశీ విశ్వనాథ్ ధామ్ సిబ్బంది.. ఇంతకు మోడీ ఏం చేశారంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కలల ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మక 'కాశీ విశ్వనాథ్ కారిడార్' ఫేజ్-1ను గతేడాది డిసెంబర్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన కలల ప్రాజెక్టు ప్రతిష్ఠాత్మక ‘కాశీ విశ్వనాథ్ కారిడార్’ ఫేజ్-1ను గతేడాది డిసెంబర్ లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ధామ్ లో చాలా సేపు గడిపారు. అక్కడి సిబ్బంది, సేవకులతో కలిసి సహపంక్తి భోజనాలు కూడా చేశారు. కాగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ ధామ్ ఆలయ ప్రాంగణంలో రబ్బరు, తోలు చెప్పులు ధరించి తిరగడం నిషిద్ధం. ఈక్రమంలో గతేడాది ఈ దేవస్థానం దర్శనానికి వచ్చినప్పుడు చాలామంది పూజారులు, సిబ్బంది, సేవకులు, సెక్యూరిటీ గార్డులు, పారిశద్ధ్య కార్మికులు కాళ్లకు పాదరక్షలు లేకుండా విధులు నిర్వర్తించడం గమనించారు.
ఈ క్రమంలో చలికాలంలో కాళ్లకు చెప్పులు లేకుండా వారు ఇబ్బందులు పడుతుండడం చూసి మోడీ చలించిపోయారు. అందుకే వారి కోసం జనపనారతో ప్రత్యేకంగా తయారుచేసిన 100 జతల పాదరక్షలను వారికి పంపించారు. ఈక్రమంలో మోడీ గుర్తుంచుకుని మరీ తమకు పాదరక్షలను పంపడంపై కాశీ విశ్వనాథ్ ధామ్ పూజారులు, సిబ్బంది, సేవకులు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఈక్రమంలో ప్రజాసంక్షేమం పట్ల మోడీకున్న శ్రద్ధకు నిదర్శనమంటున్నారు. కాగా గతేడాది వారణాసి పర్యటనకు వచ్చిన ప్రధాని పలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. అందులో భాగంగానే రూ. 800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాశీ విశ్వనాథ్ కారిడర్ ను ప్రారంభించారు.
Also Read:Janhvi kapoor: పుష్ప సినిమాను చూసిన శ్రీదేవి కూతురు.. బన్నీ గురించి ఏం చెప్పిందంటే..
Shanmukh: చాలా రోజుల తర్వాత దీప్తి ఫొటోను షేర్ చేసిన షణ్ముఖ్.. నెట్టింట్లో వైరల్ గా మారిన పోస్ట్..