Qatar Amir: భారత్‌కు ఖతార్ అమీర్.. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రధాని మోదీ ఘన స్వాగతం!
Qatar Amir: ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ ఆయన ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం అవగాహన ఒప్పందాలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఖతార్ అమీర్ అధ్యక్షుడు ముర్మును కలుస్తారని సలహాదారు..

రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం సాయంత్రం భారతదేశానికి చేరుకున్న ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం విమానాశ్రయానికి వెళ్లి ఘన స్వాగతం పలికారు. మంగళవారం నాడు అమీర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. అలాగే ప్రధాని మోడీతో చర్చలు జరపనున్నారు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వస్తున్నారు. ఖతార్ అమీర్ భారతదేశానికి ఇది రెండవ అధికారిక పర్యటన. ఆయన గతంలో 2015 మార్చిలో భారతదేశాన్ని సందర్శించారు.
భారతదేశం, ఖతార్ మధ్య స్నేహం, నమ్మకం, పరస్పర గౌరవం లోతైన చారిత్రక సంబంధాలు ఉన్నాయి. ఇటీవలి సంవత్సరాలలో వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, సంస్కృతి, ప్రజల మధ్య సంబంధాలు వంటి రంగాలతో సహా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతున్నాయి.
ఆయన పర్యటన పెరుగుతున్న భాగస్వామ్యానికి మరింత ఊపునిస్తుందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆయనతో పాటు మంత్రులు, సీనియర్ అధికారులు, వ్యాపార ప్రతినిధులతో సహా ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం వస్తుందని తెలిపింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం సాయంత్రం ఆయనను కలువనున్నారు. మంగళవారం ఉదయం ఖతార్ అమీర్‌కు రాష్ట్రపతి భవన్ ముందు ప్రాంగణంలో లాంఛనప్రాయ స్వాగతం లభిస్తుంది. ఆ తర్వాత హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో ఆయన సమావేశం అవుతారు.
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేస్తూ ఆయన ప్రధాని మోదీతో చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం అవగాహన ఒప్పందాలు జరుగనున్నాయి. ఆ తర్వాత ఖతార్ అమీర్ అధ్యక్షుడు ముర్మును కలుస్తారని సలహాదారు తెలిపారు. ఖతార్‌లో నివసిస్తున్న భారతీయ సమాజం ఖతార్‌లో అతిపెద్ద ప్రవాస సమాజంగా ఏర్పడింది. అలాగే ఖాతార్ పురోగతి, అభివృద్ధిలో దాని సానుకూల సహకారానికి ప్రశంసలు అందుకుంటోందని తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
