PM Narendra Modi Lucknow Visit: ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ (PMAY-U) కింద నిర్మించిన 75వేల ఇళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లబ్ధిదారులకు అందజేశారు. ఉత్తరప్రదేశ్‌లోని 75 జిల్లాల్లోని 75వేల మంది లబ్ధిదారులకు వర్చువల్ ద్వారా ఇంటి తాళాలను అందించారు. ఆ తర్వాత వర్చువల్‌గా ఆయన లబ్ధిదారులతో సంభాషించారు. లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్టాన్ ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్‌స్కేప్ ఎక్స్‌పోను మంగళవారం నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్నోకు చేరుకుని ప్రారంభించారు. ఈ కార్యక్రంలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్ పురి, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద యూపీలో 17.3 లక్షల ఇళ్లను ఇప్పటివరకు మంజూరుచేశారు. 8.8 లక్షల మంది లబ్ధిదారులకు ఇళ్లను అందజేసినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేదల ఖాతాల్లో దాదాపు లక్ష కోట్ల రూపాయలను బదిలీ చేసిందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే.. మూడు కోట్ల కుటుంబాలు ఆవాస్ యోజన పథకం ద్వారా లక్షాధికారులు అయ్యే అవకాశం వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద దేశంలో దాదాపు 3 కోట్ల ఇళ్లు నిర్మించినట్లు వెల్లడించారు. వీటిద్వారా ఎన్నికోట్లు కేటాయించామో ఊహించుకోవచ్చంటూ పేర్కొన్నారు. కాగా.. డిజిటల్ చెల్లింపుల విషయంలో భారతదేశం కొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరులో ప్రతి నెలా రూ.6 లక్షల కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు ప్రధాని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా వేగంగా మారుతోందంటూ ప్రధాని వ్యాఖ్యానించారు.
Lucknow: PM Narendra Modi inaugurated & laid foundation stones of 75 Urban Development Projects of Uttar Pradesh under Smart Cities Mission & AMRUT.
He also flagged off 75 buses under FAME-II for 7 cities incl Lucknow, Kanpur, Varanasi, Prayagraj, Gorakhpur, Jhansi & Ghaziabad pic.twitter.com/ztUn4zE8y8
— ANI UP (@ANINewsUP) October 5, 2021
దేశానికి స్వాతంత్య్రం 75ఏళ్లు సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా.. ప్రధాని మోదీ న్యూ అర్బన్ ఇండియా పథకాన్ని ప్రారంభించారు. దీంతోపాటు లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగరాజ్, గోరఖ్‌పూర్, ఝాన్సీ, ఘజియాబాద్‌తో సహా ఏడు నగరాల కోసం FAME-II కింద ఏర్పాటు చేసిన 75 బస్సులను కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.
Also Read: