AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ రాజీనామా.. వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి..!

నరేంద్ర మోదీ బుధవారం (జూన్ 5) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు. అలాగే, 17 వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ. రాష్ట్రపతి దీనిని అంగీకరించి, తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరారు.

PM Modi: ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ రాజీనామా.. వెంటనే ఆమోదించిన రాష్ట్రపతి..!
Pm Modi Droupadi Murmu
Balaraju Goud
|

Updated on: Jun 05, 2024 | 3:29 PM

Share

నరేంద్ర మోదీ బుధవారం (జూన్ 5) తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాష్ట్రపతి భవన్‌కు చేరుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాజీనామా సమర్పించారు. అలాగే, 17 వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ. రాష్ట్రపతి దీనిని అంగీకరించి, తాత్కాలిక ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము మధ్య భేటీకి సంబంధించిన దృశ్యాలు వెలువడ్డాయి. ఢిల్లీలో ఎన్డీఏ సమావేశానికి ముందు ప్రధాని మోదీ తన రాజీనామాను అధ్యక్షుడు ముర్ముకు సమర్పించారు.

ప్రధాని పదవికి రాజీనామా చేసిన మోదీ, ఈ సాయంత్రం జరిగే ఎన్డీఏ కూటమి సమావేశంలో మరోసారి ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు. 17 వ లోక్‌సభను రద్దు చేయాలని రాష్ట్రపతి ముర్ముకు సిఫారసు చేశారు మోదీ. జూన్ నెల 7వ తేదీన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్డీఏ కూటమికి 293 స్థానాలు, ఇండియా కూటమికి 263 స్థానాలు దక్కాయి. ఎన్డీఏ 272 సీట్ల మ్యాజిక్‌ ఫిగర్‌ దాటడంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని కూటమి నేతలు కోరబోతున్నారు. జూన్ నెల 8వ తేదీన మరోసారి మోదీ దేశ ప్రధానిగా ప్రమాణం చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

నిజానికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 294 సీట్లతో మెజారిటీ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. బీజేపీకి సొంతంగా మెజారిటీ రాలేదు. దీంతో ఎన్డీయే మిత్రపక్షాలు తప్పుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అలాంటి పరిస్థితి వస్తే మళ్లీ ఎన్డీయే అధికారంలోకి రావడం కష్టమే. బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది. అయితే ఇరువురు నేతలు మాత్రం ఇప్పటికే ఎన్డీయేతోనే ఉంటామనే సంకేతాలు ఇచ్చారు.

బుధవారం ఢిల్లీలో ఎన్డీయే సమావేశం జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు దాని మిత్రపక్షాల ప్రముఖ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. నితీష్ కుమార్ కూడా ఢిల్లీ చేరుకున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీకి బయలుదేరారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ఏర్పాటు, తదుపరి వ్యూహంపై చర్చించనున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని బీజేపీ పూర్తిగా ధీమాగా ఉంది. ఈ కారణంగానే జూన్ 7న పార్లమెంట్ హౌస్‌లో ఎన్డీయే ఎంపీలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ప్రధాని మోదీ అధ్యక్షతన ఈరోజు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలను సమీక్షించడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై చర్చించారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని కేబినెట్ సిఫార్సు చేసింది. దీనిపై లోతుగా చర్చించిన తర్వాతే ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Follow Us
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!
గరుడ పురాణం ఇంట్లో ఉంచుకోవచ్చా? నిజం ఏంటి తెలుసుకోండి!