PM Modi – 35 Crops : రైతులకు గుడ్ న్యూస్.. 35 రకాల కొత్త వంగడాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ..

PM Modi - 35 Crops : భారతదేశ రైతులకు వరం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టకుని పెరిగే,

PM Modi - 35 Crops : రైతులకు గుడ్ న్యూస్.. 35 రకాల కొత్త వంగడాలను జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ..
Pm Modi
Follow us
Shiva Prajapati

| Edited By: KVD Varma

Updated on: Sep 28, 2021 | 5:54 PM

PM Modi – 35 Crops : భారతదేశ రైతులకు వరం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రధాని నరేంద్ర మోదీ. అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టకుని పెరిగే, సంపూర్ణ పోషకాలు కలిగిన 35 రకాల వంగడాలను మంగళవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. వర్చువల్‌గా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ వ్యాప్తంగా ఉన్న రైతులతో మాట్లాడారు. చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. నేరుగా రైతులకు ప్రయోజనం చేకూర్చడమే తమ లక్ష్యం అని పేర్కొన్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతులే నేరుగా లబ్దిపొందేలా చేయడమే తమ కర్తవ్యం అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రధాని మోదీ విడుదల చేసిన పంట రకాల్లో.. బుక్వీట్, క్వినోవా, గోధుమ, వరి, టర్, సోయాబీన్, ఆవాలు, మొక్కజొన్న, జోవార్, బజ్రా, గ్రామ్, వాకల వంటి 35 కొత్త పంట రకాలు ఉన్నాయి.

కాగా, ఈ వర్చువల్ మీటింగ్‌లో కొత్త పద్ధతిలో సాగు చేస్తున్న రైతులతో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రభుత్వం రైతులకు మెరుగైన విత్తనాలను అందించిందని చెప్పారు. సాయిల్ హెల్త్ కార్డు, ఎరువుల లభ్యత, MSP లో రికార్డు కొనుగోలు వంటి వాటిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ICAR) ప్రత్యేక లక్షణాలతో కూడిన పంట రకాలను అభివృద్ధి చేసిందని, విత్తన మార్కెట్ నుండి రైతులకు నేరుగా వీటిని అందించడం జరుగుతుందని తెలిపారు. ఇక రైతులకు కేంద్రం అందిస్తున్న పథకాల గురించి కూడా ప్రధాని మోదీ ఈ సందర్భంగా వివరించారు. ఇక ఉత్తరాఖండ్‌కు చెందిన ఓ రైతుతో మాట్లాడిన పీఎం.. కొత్త వ్యవసాయ పద్ధతులు అనుసరించడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలిగాయని ప్రశ్నించగా.. రైతు సమాధానం చెప్పాడు.

ఇకపోతే.. వ్యవసాయం కోసం కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్న వ్యవసాయ శాస్త్రవేత్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. వ్యవసాయం, సైన్స్ మధ్య సంబంధం ఉందని అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. వాతావరణానికి తగ్గట్లు కొత్త రకాల విత్తనాలను తయారు చేయడం జరిగిందని చెప్పుకొచ్చారు.

ఇదిలాఉంటే.. నేషనల్ బయోటిక్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ క్యాంపస్‌ను కూడా ప్రధాని మోదీ దేశానికి అంకితం చేశారు. లైఫ్ స్ట్రెస్‌కి సంబంధించి ప్రాథమిక, వ్యూహాత్మక పరిశోధనలు నిర్వహించడానికి, మానవ వనరులను అభివృద్ధి చేయడానికి రాయపూర్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బయోలాజికల్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌ను స్థాపించారు. కాగా, ఈ నేషనల్ బయోటిక్స్ స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పంటలపై వాతావరణ మార్పుల ప్రభావాన్ని అంచనా వేస్తుందని, సమస్యను పరిష్కరించడంలో సహాయపడుతుందని తెలిపారు.

Aslo read:

AP Crime News: ఆంధ్రప్రదేశ్‌లో వరుస దారుణాలు.. ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేసి అతను.. భర్త వేధింపులకు ఆమె బలి..

Telangana Weather Report: తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు.. అలర్ట్ అయిన అధికారయంత్రాంగం..

Viral Video: అందరినీ హడలెత్తించిన లేడీ దెయ్యం.. అతను ఇచ్చిన ట్విస్ట్‌కు బిత్తరపోయింది.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..