మూడు దేశాలు.. 5రోజులు.. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ తొలి విదేశీ పర్యటన!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ కెనడాలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. దీంతో పాటు, ఆయన సైప్రస్, క్రొయేషియా దేశాలను కూడా సందర్శిస్తారు. G7 శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ సమస్యలు చర్చిస్తారు. అలాగే వివిధ దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ పర్యటన మొదటి విదేశీ పర్యటన.

ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈసారి ప్రధాని మోదీ విదేశీ పర్యటన 5 రోజులు ఉంటుంది. ఈ సమయంలో ఆయన మూడు దేశాలను సందర్శిస్తారు. ఆపరేషన్ సింధూర్, భారతదేశం-పాకిస్తాన్ మధ్య వివాదం తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న మొదటి విదేశీ పర్యటన ఇది. ఈ పర్యటనలో ఆయన క్రొయేషియాను కూడా సందర్శిస్తారు. ఇప్పటివరకు భారత ప్రధానులు ఎవరూ క్రొయేషియాకు అధికారిక పర్యటన చేయలేదు. ఈ పర్యటనలో ఆయన మొదట సైప్రస్‌కు చేరుకుంటారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం(జూన్ 15) ఢిల్లీ నుండి సైప్రస్, కెనడా, క్రొయేషియాకు బయలుదేరి వెళ్లారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, ఆయన కెనడాలో జరిగే G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతారు. సైప్రస్, క్రొయేషియాలను కూడా సందర్శిస్తారు. దీని తరువాత, ప్రధాని మోదీ జూన్ 18న క్రొయేషియాకు వెళ్లి జూన్ 19న భారతదేశానికి తిరిగి వస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో మొదట సైప్రస్‌ను సందర్శిస్తారు. ఆ దేశ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆహ్వానం మేరకు జూన్ 15-16 తేదీలలో ఆయన అక్కడే బస చేస్తారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి తొలిసారిగా ఈ పర్యటనకు వస్తున్నారు. అందుకే దీనిని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తున్నారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi departs for Cyprus.
At the invitation of the President of Cyprus, Nikos Christodoulides, PM Modi is paying an official visit to Cyprus from 15-16 June. PM Modi is on a three-nation tour, during which he will attend the G7 Summit in… pic.twitter.com/x9Q1eyBARk
— ANI (@ANI) June 15, 2025
తన పర్యటనలోని రెండవ దశలో, ప్రధానమంత్రి మోదీ జూన్ 16-17 తేదీలలో కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు G-7 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడానికి కెనడాలోని కననాస్కిస్‌ను సందర్శిస్తారు. ప్రధానమంత్రి వరుసగా ఆరోసారి G7 శిఖరాగ్ర సమావేశానికి హాజరవుతున్న భారత ప్రధానిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించిబోతున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలు, ముఖ్యంగా AI-శక్తి సంబంధాలు, క్వాంటం సంబంధిత సమస్యలతో సహా ముఖ్యమైన ప్రపంచ సమస్యలను G-7 దేశాల నాయకులు, ఇతర ఆహ్వానించిన ఔట్రీచ్ దేశాలు, అంతర్జాతీయ సంస్థల అధిపతులతో చర్చిస్తారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి అనేక ద్వైపాక్షిక సమావేశాలను కూడా నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి ఈ విదేశీ పర్యటన చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తున్నారు. దీనికి కారణం సైప్రస్, క్రొయేషియా పర్యటన. ఎందుకంటే ఇప్పటివరకు ఏ భారత ప్రధాని క్రొయేషియాను సందర్శించలేదు. ప్రధాని మోదీ తన పర్యటన చివరి దశలో జూన్ 18న క్రొయేషియాకు చేరుకుంటారు. క్రొయేషియాను సందర్శించిన మొదటి ప్రధానమంత్రి ప్రధాని మోదీ అవుతారు. క్రొయేషియా ప్రధాని ప్లెన్కోవిక్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించనున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




