AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవాళ ట్రంప్‌తో భేటీ కానున్న ప్రధాని మోదీ.. సర్వత్రా ఆసక్తి

ప్రధాని మోదీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం బియారిట్జ్‌ నగరానికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఇరువురి ఈ భేటీ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలమధ్య వాణిజ్య సంబంధాలపై చర్చ జరగనుంది. అదే విధంగా జమ్ము కశ్మీర్ అంశంపై కూడా ట్రంప్‌తో నేరుగా చర్చించనున్నారు. ఇప్పటికే ట్రంప్‌కు ఈ విషయంపై ఫోన్ ద్వారా […]

ఇవాళ ట్రంప్‌తో భేటీ కానున్న ప్రధాని మోదీ.. సర్వత్రా ఆసక్తి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 26, 2019 | 1:06 AM

Share

ప్రధాని మోదీ ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నారు. జీ-7 దేశాల సమ్మేళనంలో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌ పర్యటనలో ఉన్న మోదీ ఆదివారం బియారిట్జ్‌ నగరానికి చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ఇరువురి ఈ భేటీ జరిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాలమధ్య వాణిజ్య సంబంధాలపై చర్చ జరగనుంది. అదే విధంగా జమ్ము కశ్మీర్ అంశంపై కూడా ట్రంప్‌తో నేరుగా చర్చించనున్నారు. ఇప్పటికే ట్రంప్‌కు ఈ విషయంపై ఫోన్ ద్వారా చెప్పారు. ఇదిలా ఉంటే ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాక్ అనుసరిస్తున్న విధానాలపై కూడా ట్రంప్‌కు వివరించనున్నారు. ఇక సోమవారం సాయంత్రం 6.30కు ప్రధాని మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రెటరితో కూడా సమావేశం కానున్నారు.