AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ కాల్.. శాంతి కోసం ఏ సాయానికైనా భారత్ సిద్ధమని స్పష్టం..

ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక టెలిఫోన్ సంభాషణ జరిపారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్చల్లో యుద్ధ పరిణామాలు, భవిష్యత్ శాంతి ప్రయత్నాలతో పాటు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. వివాదాల పరిష్కారానికి దౌత్య మార్గాలే మంచిదని స్పష్టం చేసిన భారత్.. ప్రపంచ శాంతి కోసం తన వంతు సహకారాన్ని అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది.

జెలెన్‌స్కీతో ప్రధాని మోదీ కీలక ఫోన్ కాల్.. శాంతి కోసం ఏ సాయానికైనా భారత్ సిద్ధమని స్పష్టం..
Pm Modi Speaks With President Zelenskyy
Krishna S
|

Updated on: Nov 09, 2026 | 7:38 PM

Share

రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ మధ్య కీలక టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఇరు దేశాల అధినేతలు తాజా పరిస్థితులు, యుద్ధ పరిణామాలు, ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంభాషణ సందర్భంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను ప్రధాని మోదీకి జెలెన్‌స్కీ వివరించారు. దీనిపై స్పందించిన భారత ప్రధాని.. మానవీయ కోణానికి భారత్ ఇచ్చే ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు.

చర్చలు, దౌత్యమే ఏకైక మార్గం

యుద్ధాలు సమస్యలకు పరిష్కారం కావని, చర్చలు మరియు దౌత్య మార్గాల ద్వారానే వివాదాలను పరిష్కరించుకోవచ్చన్న భారత్ స్థిర వైఖరిని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు, ఈ సంక్షోభాన్ని శాంతియుతంగా పరిష్కరించడానికి సాగే అన్ని ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడానికి భారత్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన భరోసా ఇచ్చారు.

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టి

ఈ ఫోన్ కాల్‌లో కేవలం యుద్ధ పరిణామాలే కాకుండా, భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక బంధంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఇరు దేశాల ప్రజల పరస్పర ప్రయోజనాల కోసం పలు రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని, బలోపేతం చేసుకోవాలని మోదీ, జెలెన్‌స్కీ నిర్ణయించారు.

Follow Us