PM Modi: అవినీతిని సంరక్షించాలంటూ కొన్ని పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి.. విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు..

అవినీతిపరులంతా ఒకే వేదికపైకి వచ్చారని మోదీ చురకలంటించారు. అవినీతిపరులపై చర్యలతో దేశ ప్రజలు సంతోషంగా ఉన్నారని మోదీ చెప్పారు. తాను ఎక్కడికి వెళ్లినా అవినీతిపరులపై చర్యలు కొనసాగించాలని చెబుతున్నారని మోదీ గుర్తు చేశారు.

PM Modi: అవినీతిని సంరక్షించాలంటూ కొన్ని పార్టీలు ఉద్యమాలు చేస్తున్నాయి.. విపక్షాలకు ప్రధాని మోదీ చురకలు..
PM Modi
Follow us

|

Updated on: Mar 28, 2023 | 10:09 PM

విపక్షాలపై సైటైర్లు సందించారు ప్రధాని నరేంద్ర మోదీ. అవినీతిపై చర్యలు తీసుకుంటే వారి మూలాలు కదిలిపోయాయని ఎద్దేవ చేశారు. భారత్‌ను అడ్డుకునేందుకు నేడు రాజ్యాంగ సంస్థలపై దాడులు జరుగుతున్నాయన్నారు. న్యూఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయం కొత్త భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. కోర్టు తీర్పు వెలువరించినప్పుడు కోర్టులో ప్రశ్నలు తలెత్తుతాయని ప్రధాని మోదీ అన్నారు. దీంతో న్యాయ వ్యవస్థపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏడు దశాబ్దాల్లో తొలిసారిగా ఎన్నడూ లేనంతగా అవినీతిపై పోరాడుతుంటే కొందరికి  కోపం వస్తోందన్నారు ప్రధాని మోదీ. అందుకే వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రధాని చెప్పారు. భారత్‌లో పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థలున్నాయని, బీజేపీని ఎదుర్కోలేక రాజ్యాంగ సంస్థలపై దాడులు చేస్తున్నారని ప్రధాని విమర్శించారు.

కఠినంగా వ్యవహరిస్తోన్న రాజ్యాంగ సంస్థలను ప్రశ్నిస్తూ కోర్టులకు వెళ్తున్నారని మోదీ ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలైతే అవినీతిని సంరక్షించాలంటూ భ్రష్టచార్ బచావో అభియాన్ ఉద్యమం నడుపుతున్నారని సెటైర్ వేశారు.

మోదీ ఇంటిపేరు’కు సంబంధించి సూరత్ కోర్టు ఇచ్చిన వాంగ్మూలానికి సంబంధించిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడిన తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. దీనితో పాటు, ఈ శిక్ష ఆధారంగా, లోక్‌సభ సెక్రటేరియట్ అతని పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసింది. రాహుల్ గాంధీపై తీసుకున్న చర్యను విపక్షాలన్నీ ఖండించాయి. పార్లమెంట్‌ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలో కూడా విపక్షాలు ఏకతాటిపైకి వచ్చినట్లు కనిపిస్తున్నాయి. అదానీ కేసులో ఈ పార్టీలు జేపీసీని డిమాండ్ చేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం