AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: వాళ్లే కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటున్నారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..

లోక్‌సభ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మోదీ. రాజస్థాన్‌లో పలు సభలో తనదైన శైలిలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. జాలోర్‌లో ప్రచారం నిర్వహించారు ప్రధాని. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్ధులు దొరకడం లేదని విమర్శించారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 300 కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు మోదీ.

PM Modi: వాళ్లే కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దంటున్నారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 21, 2024 | 8:48 PM

Share

లోక్‌సభ ఎన్నికల్లో సుడిగాలి ప్రచారం చేస్తున్నారు మోదీ. రాజస్థాన్‌లో పలు సభలో తనదైన శైలిలో కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. జాలోర్‌లో ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ… లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కాంగ్రెస్‌కు అభ్యర్ధులు దొరకడం లేదని విమర్శించారు. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు 300 కంటే తక్కువ సీట్లలో పోటీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు మోదీ. ఓటమి భయం తోనే సోనియాగాంధీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విమర్శించారు. ఇండియా కూటమి లోని పార్టీలు ఒకరిపై ఒకరు అభ్యర్ధులను నిలబెట్టుకున్నాయన్నారు మోదీ. కేవలం పేరుకు మాత్రమే ఈ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని అన్నారు.. కాంగ్రెస్ (షాహి పరివార్) కుటుంబసభ్యులే ఆ పార్టీకి ఓటు వేయొద్దంటున్నారని.. ఇంకా వారికి ఓటు ఏవరేస్తారంటూ ఎద్దెవా చేశారు.

దేశప్రజలు .. ముఖ్యంగా యువత కాంగ్రెస్‌కు గుణపాఠం చెబుతున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలో చూడడం వాళ్లకు అసలు ఇష్టం లేదు. గతంలో ఆ పార్టీ 400 సీట్లు గెలిచింది. ఒకప్పుడు 400 సీట్లు గెలిచిన పార్టీ ఇప్పుడు కేవలం 300 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోంది. కాంగ్రెస్‌ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్ధులు కూడా దొరకడం లేదు.. కుటంబవ్యక్తులే.. కాంగ్రెస్ కు ఓటు వేయొద్దంటున్నారంటూ ప్రధాని మోదీ విమర్శించారు.

వీడియో చూడండి..

జాలోర్‌ సభ తరువాత బాన్స్‌వారాలో ప్రచారం చేశారు మోదీ. కాంగ్రెస్‌ పార్టీ నేతలు లెఫ్ట్‌ , అర్బన్‌ నక్సలైట్ల ట్రాప్‌లో పడిపోయారన్నారు మోదీ. కాంగ్రెస్‌ మేనిఫెస్టో లోని అంశాలు తీవ్ర ఆందోళన కలగిస్తున్నాయన్నారు. ఆర్ధిక సర్వే పేరుతో ప్రజల సంపదను లెక్కిస్తామని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారన్నారు. మహిళల దగ్గర ఉన్న బంగారం లెక్కలు కూడా తీస్తామంటున్నారని అన్నారు. సంపదను పంచుతామన్న కాంగ్రెస్‌ హామీని మీరు సమర్ధిస్తారా ? అని ప్రశ్నించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..