PM Modi: మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు.. ప్రధాని ఇంట ఘనంగా రక్షా బంధన్ వేడుకలు.. వీడియో

దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి కోలాహలం నెలకొంది.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ప్రేమాప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. రక్షా బంధన్ ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరంద్రమోదీకి చిన్నారులు రాఖీ కట్టారు.

Follow us

|

Updated on: Aug 19, 2024 | 4:30 PM

దేశవ్యాప్తంగా రాఖీ పౌర్ణమి కోలాహలం నెలకొంది.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి, ప్రేమాప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.. రక్షా బంధన్ ను పురస్కరించుకుని ప్రధానమంత్రి నరంద్రమోదీకి చిన్నారులు రాఖీ కట్టారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి రక్షా బంధన్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా బాలికలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.. వారితో కలిసి సరదాగా పండుగను జరుపుకున్నారు. ప్రధాని మోదీకి చిన్నారులు రంగు రంగుల రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. రాఖీ వేడుకలకు సంబంధించిన చిత్రాలను, వీడియోలను ఎక్స్ లో షేర్ చేశారు.. తన యువ స్నేహితులతో కలిసి రక్షా బంధన్‌ని జరుపుకున్నందుకు సంతోషంగా ఉందంటూ.. ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇదిలాఉంటే.. రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రధాని మోదీ.. సోమవారం ఉదయం దేశ ప్రజలందరికీ రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పండుగ మీ అందరి బంధాల్లో కొత్త మాధుర్యాన్ని, జీవితంలో ఆనందం, శ్రేయస్సు తీసుకురావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఆ శుభలేఖను చూసి ఆశ్చర్యపోతున్న బంధుమిత్రులు.. అంత స్పెషల్ ఏంటంటే.
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
ఎన్‎సీసీ ముసుగులో మృగాడి ఘాతుకం.. మైనర్ బాలికపై అమానుషం..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
రీల్స్ మోజులో యువత పిచ్చి పీక్స్.. లైకుల కోసం లైఫ్‌నే రిస్క్..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
వక్ర బుధుడితో ఆ రాశుల వారు జాగ్రత్త..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
మ్యాథ్యు పెర్రీ మృతి కేసులో సంచలన విషయాలు..
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
డ్రంక్ అండ్ డ్రైవ్‎లో సరికొత్త రికార్డ్..15 రోజుల్లో ఇన్ని కేసులా
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
ఇంటి ముందుకు వచ్చిన సింహాలు.. ఈ వీడియో చూస్తే గుండె ఆగిపోద్ది..
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
మీకు ఇంకా ఇన్‌కమ్ ట్యాక్స్ రీఫండ్ రాలేదా? ఈ కారణాలు కావచ్చు!
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
సమోసాలే విద్యార్థుల ప్రాణాలు తీశాయి.. వెలుగులోకి సంచలన విషయాలు..
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం
నడవాలంటే నెలల సమయం.. ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలు.. అసలు కారణం