AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court on Article 370: అర్టికల్ 370పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని ఐదుగురు జడ్డిలు చదువుతున్నారు. ఐదుగురు జడ్జిల్లో ముగ్గురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.  తీర్పును చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ చదివి వినిపిస్తున్నారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని తెలిపింది. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించింది.

Supreme Court on Article 370: అర్టికల్ 370పై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
PM Narendra Modi
Srikar T
|

Updated on: Dec 11, 2023 | 2:01 PM

Share

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం వెలువరించింది. కేంద్రం నిర్ణయంపై తమ అభిప్రాయాన్ని ఐదుగురు జడ్డిలు చదువుతున్నారు. ఐదుగురు జడ్జిల్లో ముగ్గురు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370పై కేంద్రం నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.  తీర్పును చీఫ్ జస్టీస్ చంద్రచూడ్ చదివి వినిపిస్తున్నారు. భారతదేశంలో కాశ్మీర్ విలీనమై ఉన్నప్పుడు ప్రత్యేక హోదాలేవీ లేవు అని తెలిపారు. కాశ్మీర్ కు ప్రత్యేక సార్వభౌమాధికారం లేదని వివరించారు. మిగతా రాష్ట్రాలకు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక తేడాలేవీ లేవు అని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది సుప్రీం కోర్టు.

రెండు ఉద్దేశాల కోసమే ఆర్టికల్ 370  నాడు ఏర్పటైందని తెలిపింది. అవి కూడా తాత్కాలిక అవసరాలే అని తీర్పులో పేర్కొంది. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో జమ్మూ కాశ్మీర్ సమానమని తేల్చింది. కేంద్రం ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం రాజ్యాంగబద్దమైనదే అని చెప్పింది. నాటి ప్రత్యేక పరిస్థితులు, యుద్దం కారణంగానే ఆర్టికల్ 370 రూపొందించినట్లు వివరించింది. ఆర్టికల్ రద్దు వెనకాల ఎలాంటి దురుద్దేశం లేదని తేల్చి చెప్పింది. ఇది తాత్కాలిక ఏర్పాటే తప్ప శాశ్వతం కాదని తీర్పును వెలువరించింది. రాజ్యాంగంలోని అన్ని హక్కులు జమ్మూ కాశ్మీర్ కు వర్తిస్తాయి. లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడానికి అనుమతిస్తున్నామంటూ సీజేఐ తెలిపారు.  జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 2024 సెప్టెంబర్ 30లోపు  జమ్మూ కాశ్మీర్, లద్ధాఖ్ లలో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. దీనిపై పిటిషనర్లు వేసిన వాదనలన్నింటినీ తోసి పుచ్చింది ధర్మాసనం.

ఇవి కూడా చదవండి

మోదీ సందేశం..

సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. ప్రధాన సుప్రీం కోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఆగస్టు 5, 2019న పార్లమెంటు తీసుకున్న నిర్ణయాన్ని సరైనదని అంగీకరించింది. ఈ నిర్ణయాన్ని జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రజలకు ఆశాజనకంగా ఉండటమే కాకుండా.. వారి పురోగతికి, ఐక్యతకు దోహదపడుతుందని తాను భావిస్తున్నట్లు ప్రధాన మంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

భారతీయులందరూ ఎంతగానో ఆచరించే ఐఖ్యత అనే భావానికి సుప్రీంకోర్టు తీర్పు మరింత బలం చేకూర్చిందని ప్రధాని మోదీ అన్నారు. అంతే కాకుండా, ఈ ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడంలో ప్రభుత్వం అంకితభావంతో పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 కారణంగా కష్టాలను ఎదుర్కొన్న సమాజంలోని అత్యంత బలహీన, అట్టడుగు వర్గాలకు ప్రగతి ప్రయోజనాలు చేరేలా చూడాలనేది ప్రభుత్వ సంకల్పం అని రాసుకొచ్చారు. ఈ నిర్ణయం కేవలం చట్టపరమైన ప్రకటన మాత్రమే కాదని, ఇది ఒక ఆశా కిరణానికి ప్రతీక అని, ఉజ్వల భవిష్యత్తును మార్గాన్ని సుగమం చేస్తుందని దృఢమైన భారతదేశాన్ని నిర్మించాలనే తోర్పడుతుందన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..