పశ్చిమబెంగాల్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ లైవ్.. నేతాజీ జయంతి సందర్భంగా ‘పరాక్రమ దివస్’ ఉద్ధేశించి ప్రసంగం..

|

Updated on: Jan 23, 2021 | 7:06 PM

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా

పశ్చిమబెంగాల్ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ లైవ్.. నేతాజీ జయంతి సందర్భంగా 'పరాక్రమ దివస్' ఉద్ధేశించి ప్రసంగం..

PM Modi kolkata tour live: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా కోల్‌కతా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా ‘పరాక్రమ దివస్’ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని ‘పరాక్రమ దివస్’ వేడుకలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నేతాజీ పుట్టిన గడ్డకు నమస్కారం అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ సరికొత్త దిశా నిర్దేశం చేశారని కొనియాడారు. సుభాష్ చంద్రబోస్‌‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ భారతదేశ ధైర్యానికి ప్రేరణ అన్నారు. ఆయన త్యాగం, భారతదేశానికి ఆయన చేసిన కృషిని గుర్తుంచుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యమని గుర్తుచేశారు.ఈ రోజు భారతదేశం తన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎవరికైనా తగిన సమాధానం చెబుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఎందుకంటే నేతాజీ అందించిన స్వాతంత్ర్యంతో ఈరోజు బలమైన భారతదేశాన్ని ప్రపంచం చూస్తుందని ప్రసంగం ముగించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 23 Jan 2021 06:54 PM (IST)

    నేతాజీ వస్తువులను తిలకించిన ప్రధాని మోదీ

    ‘పరాక్రమ దివస్’ వేడుకలకు ముందు కోల్‌కతాలోని భవానీ పూర్‌లో ఉన్న నేతాజీ భవన్‌ను ప్రధాని నరేంద్రమోదీ సందర్శించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అనంతరం నేతాజీ ఉపయోగించిన కారు, మంచం, టేబుల్ తదితర వస్తువులను ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత జాతీయ లైబ్రరీని సందర్శించారు.

  • 23 Jan 2021 06:40 PM (IST)

    ప్రధాని నరేంద్రమోదీ, సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు తెలిపిన సీఎం మమతాబెనర్జీ..

    ‘పరాక్రమ దివస్’ వేడుకల గురించి సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఇదేమీ రాజకీయ పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమం కాదని, ప్రభుత్వం కార్యక్రమమని అన్నారు. ఇలాంటి చోట హుందాగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇలాంటి చోట తనకు అవమానం జరిగిందని అసహనానికి గురయ్యారు. నేతాజీకి సంబంధించి కోల్‌కతాలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ప్రధాని నరేంద్రమోదీ, సాంస్కృతిక శాఖకు ధన్యవాదాలు తెలిపారు.

  • 23 Jan 2021 06:28 PM (IST)

    'పరాక్రమ దివస్' వేడుకల్లో ప్రసంగించడానికి నిరాకరించిన సీఎం మమతాబెనర్జీ

    అంతకు ముందు 'పరాక్రమ దివస్' వేడుకల్లో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మాట్లాడవలసిందిగా కోరారు. దీంతో ఆమె వేదికపైకి చేరుకునే సమయంలో కొందరు పెద్ద ఎత్తున మోదీకి మద్దతుగా నినాదాలు చేశారు. దీంతో ఆమె అసహనానికి గురై తనకు అవమానం జరింగిందంటూ మాట్లాడేందుకు నిరాకరించారు.

  • 23 Jan 2021 06:21 PM (IST)

    సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే తగిన సమాధానం చెబుతాం : ప్రధాని నరేంద్రమోదీ

    ఈ రోజు భారతదేశం తన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ఎవరికైనా తగిన సమాధానం చెబుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఎందుకంటే నేతాజీ అందించిన స్వాతంత్ర్యంతో ఈరోజు బలమైన భారతదేశాన్ని ప్రపంచం చూస్తుందన్నారు.

  • 23 Jan 2021 06:14 PM (IST)

    నేతాజీ స్ఫూర్తితో దేశ ప్రజలందరు సంఘటితం కావాలి : ప్రధాని మోదీ

    ఈ రోజు ప్రతి భారతీయుడు తమ హృదయంపై చేయి వేసుకొని నేతాజీని స్మరించుకోవాలని ప్రధాని మోదీ అన్నారు. ఆయన స్ఫూర్తితో దేశ ప్రజలందరు సంఘటితం కావాలన్నారు. ఇండియాను ఒక గొప్పదేశంగా తీర్చిదిద్దడమే తన కర్తవ్యమని చెప్పారు.

  • 23 Jan 2021 06:07 PM (IST)

    నేతాజీకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదు: నరేంద్రమోదీ

    నేతాజీకి సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్నారు ప్రధాని నరేంద్రమోదీ. విదేశాలలో నివసిస్తున్న భారతీయుల స్పృహను కదిలించాడని కొనియాడారు. అతను ప్రతి కుల, మతం, ప్రతి ప్రాంత ప్రజలను దేశంలోని సైనికుడిగా భావించి స్వాతంత్ర్య ఉద్యమ కాంక్షను రగిలించారని గుర్తుచేశారు.

  • 23 Jan 2021 06:04 PM (IST)

    విక్టోరియా మెమోరియల్‌లో ప్రసంగిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ..

    నేతాజీ పుట్టిన గడ్డకు నమస్కారం అంటూ ప్రసంగం మొదలుపెట్టారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ సరికొత్త దిశా నిర్దేశం చేశారని కొనియాడారు. సుభాష్ చంద్రబోస్‌‌ను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు.

  • 23 Jan 2021 06:01 PM (IST)

    అండమాన్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని పేరు పెట్టాం : నరేంద్ర మోదీ

    పరాక్రమ దివస్ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. 2018 లో తాము అండమాన్ ద్వీపానికి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీపం అని పేరు పెట్టామని ప్రధాని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు గడించిందన్నారు. నేతాజీ జీవితం, ఆయన చేసిన పని, ఆయన నిర్ణయాలు మనందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. అతడు ఇచ్చిన సంకల్పంతోనే దేశం ముందుకు సాగుతుందన్నారు.

  • 23 Jan 2021 05:51 PM (IST)

    నేతాజీ జయంతిని దేశ ప్రజలు 'పరాక్రమ దివస్'గా జరుపుకుంటున్నారు: ప్రధాని నరేంద్ర మోదీ

    ప్రతి సంవత్సరం నేతాజీ జయంతిని దేశ ప్రజలు 'పరాక్రమ దివస్'గా జరుపుకుంటున్నారని అన్నారు. సుభాష్ చంద్రబోస్‌కు సంబంధించిన పత్రాలను తాము ప్రజల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా INA అనుభవజ్ఞులు పరేడ్‌లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.

  • 23 Jan 2021 05:45 PM (IST)

    ఇది ప్రభుత్వ కార్యక్రమం.. రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ 

    పరాక్రమ దివస్ కార్యక్రమాన్ని ఉద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తుండగా కార్యక్రమం గురించి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇది ప్రభుత్వ కార్యక్రమమని, అని రాజకీయ పార్టీ కార్యక్రమం కాదని కామెంట్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమానికి కొంత గౌరవం ఉండాలని తాను భావిస్తున్నట్లుగా తెలిపారు.

  • 23 Jan 2021 05:33 PM (IST)

    నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ భారతదేశ ధైర్యానికి ప్రేరణ..

    విక్టోరియా మెమోరియల్‌లో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ.. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ భారతదేశ ధైర్యానికి ప్రేరణ అన్నారు. ఆయన త్యాగం, భారతదేశానికి ఆయన చేసిన కృషిని గుర్తుంచుకోవడం భారతీయులుగా మనందరి కర్తవ్యమని గుర్తుచేశారు.

Published On - Jan 23,2021 6:54 PM

Follow us
Latest Articles