New Parliament Building: రాజదండాన్ని స్పీకర్ చాంబర్‌లో ప్రతిష్టించిన ప్రధాని మోదీ.. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంలో అద్భుత ఘట్టం..
తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం 'సెంగోల్'ను ఆయన స్వీకరించారు. ఆ తర్వాత సెంగోల్‌ను లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన నెలకొల్పి మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్ నూతన భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కొంతమంది కార్మికులను ప్రధాని సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

సనాతన ధర్మం ఉట్టిపడేలా, అత్యాధునిక హంగులతో నిర్మించిన కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఉదయం కొత్త పార్లమెంట్ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని మోదీకి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా స్వాగతం పలికారు. ఇద్దరు కలిసి నడుస్తూ పార్లమెంట్ పరిసరాలను పరిశీలించారు. సరిగ్గా ఉదయం 7.15 గంటలకు హోమం, పూజా కార్యక్రమాల్లో మోదీతో పాటు స్పీకర్ ఓంబిర్లా పాల్గొన్నారు. అంతకుముందు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహానికి మోదీ నివాళులు అర్పించారు.
తమిళనాడుకు చెందిన మఠాధిపతుల నుంచి ఉత్సవ రాజదండం ‘సెంగోల్’ను ఆయన స్వీకరించారు. ఆ తర్వాత సెంగోల్‌ను లోక్‌సభలో స్పీకర్ కుర్చీ పక్కన నెలకొల్పి మఠాధిపతుల ఆశీర్వాదం తీసుకున్నారు. హోమం అనంతరం రాజదండానికి ప్రధాని సాస్టాంగ నమస్కారం చేశారు. ఆ తర్వాత రాజదండాన్ని మోదీకి అందించారు వేద పండితులు. సెంగోల్‌ను స్వీకరించి.. వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు మోదీ.
New Parliament inauguration: PM Modi begins puja, receives ‘Sengol’ for installation
Read @ANI Story | https://t.co/pBCGzkGhT6#PMModi #NewParliamentBuilding #NewParliament pic.twitter.com/UBEaVDR7SN
— ANI Digital (@ani_digital) May 28, 2023
అనంతరం లోక్‌సభ స్పీకర్ సీటు పక్కన సెంగోల్‌ను ప్రతిష్టించారు. ఆ వీడియోను ఇక్కడ చూడండి..
New Parliament inauguration: PM Modi installs sacred ‘Sengol’ in Lok Sabha chamber
Read @ANI Story | https://t.co/1qyt8EUbOv#PMModi #NewParliamentBuilding #NewParliament pic.twitter.com/N48gcoi9yp
— ANI Digital (@ani_digital) May 28, 2023
1200 కోట్ల రూపాయలతో కొత్త పార్లమెంట్ భవనం రూపుదిద్దుకుంది. ఈ నిర్మాణంలో దాదాపు 6 వేల మంది కార్మికులు పాలుపంచుకున్నారు. వారిని ఘనంగా సన్మానించారు మోదీ. శాలువా కప్పి ఙ్ఞాపికలను అందించారు.
అనంతరం పార్లమెంట్ ఆవరణలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో పాటు పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం




