AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మీరు విసిరే బురదలో కమలం వికసిస్తుంది.. విపక్షాలకు రాజ్యసభలో ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్..

విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగుతుంది. అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చివరి వరకు..

PM Modi: మీరు విసిరే బురదలో కమలం వికసిస్తుంది.. విపక్షాలకు రాజ్యసభలో ప్రధాని మోదీ స్ట్రాంగ్ కౌంటర్..
PM Modi
Sanjay Kasula
|

Updated on: Feb 09, 2023 | 4:12 PM

Share

రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి సమాధానమిస్తూ ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు సభా వెల్‌లో గందరగోళం సృష్టించారు. అదానీ కేసులో జేపీసీ ఏర్పాటు చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు కూడా నినాదాలు చేశారు. సభలో విపక్ష సభ్యులు చేసిన నినాదాల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ, విపక్షాల నిరసనల మధ్యే రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం కొనసాగుతుంది. అదానీ వ్యవహారంపై జేపీసీకి విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నినాదాలు చివరి వరకు కొనసాగించాయి విపక్షాలు. ప్రధాని మోదీ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాయి. దీనితో ప్రధాని మోదీ విపక్షాలకు తనదైన శైలిలో మాటల తూటాలను సంధించారు. విపక్షాల తీరు చూస్తుంటే బాధగా ఉందన్నారు. దేశ ప్రగతిని కాంగ్రెస్ నాశనం చేసిందని విమర్శించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ హయాంలో పాలన శుద్ధ దండగ అని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. నేను కాంగ్రెస్ పాలనను నిశితంగా పరిశీలించానంటూ ఎద్దేవ చేశారు.

‘మీరు ఎంత బురద చల్లితే కమలం అంత బాగా వికసిస్తుందని నేను ప్రతిపక్ష ఎంపీలకు చెప్పాలనుకుంటున్నాను. గత దశాబ్దాల్లో ఎంతో మంది మేధావులు ఇక్కడి నుంచే దేశానికి దిశానిర్దేశం చేశారు. అలాంటి వాళ్లు కూడా జీవితంలో ఎన్నో విజయాలు సాధించినవారు ఇక్కడే కూర్చున్నారు. సభలో ఏం జరుగుతుందో దేశం మొత్తం వింటుంది. తీవ్రంగా పరిగణిస్తుంది. అయితే సభలో కొందరి ప్రవర్తన, ప్రసంగం సభనే కాదు.. దేశాన్ని కూడా నిరుత్సాహపరిచేలా ఉండడం దురదృష్టకరం.

తన నియోజకవర్గానికి ప్రధాని మోదీ పదే పదే వస్తున్నారని అంటూ నిన్న మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ప్రధాని మోదీ. తాను మరోసారి కూడా ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తానని అన్నారు. ఖర్గే నియోజకవర్గంలో అక్కడ 1 కోటి 70 లక్షల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరిపించామన్నారు. ఒక్క కల్బుర్గిలోనే 8 లక్షలకు పైగా జన్ ధన్ ఖాతాలు తెరిచారని గుర్తు చేశారు. ఇది చూసిన తర్వాత ఆయన (మల్లికార్జున్ ఖర్గే) బాధను నేను అర్థం చేసుకోగలను అంటూ ఎద్దేవ చేశారు.

ఇతర దేశాలు అభివృద్ధి చెందితే.. మన దేశం మాత్రం అభివృద్ధికి దూరంగా ఉంది. ఏ ఒక్క సమస్యకు కూడా కాంగ్రెస్ శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. వాళ్లు సమస్యలకు పైపూత పూశారని.. కానీ తాము మాత్రమే దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నామన్నారు.

దేశాన్ని కాంగ్రెస్‌ సర్వనాశనం చేసింది – మోదీ

దేశ ప్రజలు కాంగ్రెస్ పాలనను నిరాకరిస్తున్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మారు. కానీ దేశ ప్రజల్ని కాంగ్రెస్ వంచించింది. కానీ వారి పాలనలో ప్రజలకు మళ్లీ నమ్మకం కలిగించామన్నారు. జనం డబ్బు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్ళిందన్నారు. గరీబ్ హఠావో అనేది కాంగ్రెస్ పార్టీకి ఓ నినాదం మాత్రమే అని విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజా సమస్యలపై చర్చించాలనే చిత్తశుద్ధి లేదన్నారు ప్రధాని మోదీ.

తానెప్పుడూ రాజకీయ లబ్ది కోసం చూసుకోలేదని ప్రధాని మోదీ రాజ్యసభలో గుర్తు చేశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రజలను భాగస్వామ్యులను చేశామన్నారు. మా పథకాలు దేశ ప్రగతిని మార్చాయని.. కాంగ్రెస్ పార్టీ అప్పుడు చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తుందని విమర్శించారు. ఇక ఆదివాసీల గురించి కాంగ్రెస్ పట్టించుకోలేదు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి గిరిజనులకు బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించామని.. లక్షా 20 వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించామని గుర్తు చేశారు. ఇలా విపక్షాల నిరసనల మధ్య ప్రధాని మోదీ ప్రసంగం కొనసాగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం