AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dinosaur Park: రూ.13.72 కోట్లతో దేశంలో భారీ డైనోసర్ థీమ్ పార్క్.. ఎక్కడంటే..?

దేశంలోనే భారీ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌కు నిర్మాణానికి బుధవారం బీజం పడింది. సుమారు 13.72 కోట్లతో నిర్మిస్తున్న ఈ పార్కును వేస్ట్‌ టు హెల్త్‌ విధానంలో దీనిని నిర్మిస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్మిస్తున్న ఈ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌కు బుధవారం గవర్నర్‌...

Dinosaur Park: రూ.13.72 కోట్లతో దేశంలో భారీ డైనోసర్ థీమ్ పార్క్.. ఎక్కడంటే..?
Dinosaur Park
Narender Vaitla
|

Updated on: Feb 09, 2023 | 5:17 PM

Share

దేశంలోనే భారీ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌కు నిర్మాణానికి బుధవారం బీజం పడింది. సుమారు 13.72 కోట్లతో నిర్మిస్తున్న ఈ పార్కును వేస్ట్‌ టు హెల్త్‌ విధానంలో దీనిని నిర్మిస్తున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్మిస్తున్న ఈ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌కు బుధవారం గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా ఈ పార్కు నిర్మాణానికి పునాది రాయి వేశారు. 3.5 ఎకరాల్లో ఈ పార్కు సెకండ్‌ ఫేజ్‌ను నిర్మిస్తున్నారు.

ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఈ డైనోసర్‌ థీమ్‌ పార్క్‌ను నిర్మిస్తోంది. చిన్నారులను ఆకర్షించేందుకు గాను ఈ పార్క్‌ను రూపొందిస్తున్నారు. ఈ పార్కులో దాదాపు 250 టన్నుల చెత్తతో 15 డైనోసర్‌ బొమ్మలను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా పార్కులో లైటింగ్‌తో పాటు సౌండ్‌ ఎఫెక్ట్స్‌తో పాటు ఫుడ్‌ కోర్ట్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సేకరించే చెత్తతో ఈ పార్కులో ఏడు ప్రపంచ వింతల నిర్మాణాలకు పునసృష్టించనున్నారు. ఇలా ప్రపంచంలోని ఏడు వింతలను ఒకే చోట ఏర్పాటు చేస్తున్న తొలి పార్క్‌ ఇదేనని అధికారులు చెబుతున్నారు. వేస్ట్ టు వండర్‌ పేరుతో ఈ పార్కును నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ పార్కు తొలి ఫేజ్‌ను 2019 ఫిబ్రవరిలో కేంద్ర మంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్ ప్రారంభించారు. తాజాగా పార్కు రెండో దశను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అభివృద్ధి చేయబడుతుంది. G20 సమ్మిట్‌కు ముందు, ఇటువంటి ప్రాజెక్ట్ దేశ రాజధాని అందాన్ని మరింత పెంచుతుందని ఢిల్లీ మున్సిపల్‌ అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..