PM Modi: ఇండియన్ నేవీ పోరాటం వీరోచితం.. ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.
లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో (అరేబియన్ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. జనవరి 4న గుర్తు తెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. దీంతో వెంటనే రంగంలోకి..

సమద్ర దొంగల నుంచి వాణిజ్య నౌకను విడిపించిన భారత నావికాదళాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తాజాగా జైపూర్‌లో జరిగిన డీజీపీ, ఐజీపీల 58వ కాన్ఫరెన్స్‌లో ప్రధాని నరేంద్రమోదీ పొగడ్తల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘రెండు రోజుల క్రితం ఇండియన్ నేవీ వీరోచిత ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఆ సమయంలో షిప్‌లో 21 మంది ఉన్నారు. వీరిలో 15 మంది భారతీయులే ఉన్నారు. భారత తీరానికి 2 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వాణిజ్య నౌకను రక్షించారు’ అని చెప్పుకొచ్చారు. ఇక నేవీ ధైర్యసాహసాలు ప్రశంసిస్తూ ప్రధాని భారత్ మాతాకీ జై అని నినాదాలు చేశారు.
ఇదిలా ఉంటే.. లైబీరియా జెండాతో ఉన్న నౌక సోమాలియా తీరంలో (అరేబియన్ సముద్రం) హైజాక్‌కు గురైన విషయం తెలిసిందే. ఈ హైజాకింగ్ గురించి వెంటనే యూకే మారిటైమ్ ఏజెన్సీకి నౌక సిబ్బంది సందేశం పంపింది. జనవరి 4న గుర్తు తెలియని సాయుధులు నౌకలోకి ఆయుధాలతో అక్రమంగా ప్రవేశించి తమ ఆధీనంలోకి తీసుకున్నారని పేర్కొంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన భారత నావికాదళం వాణిజ్య నౌనకు విడిపించింది. నావికాదళానికి చెందిన యుద్ధనౌక ఐఎన్‌ఎస్ చెన్నై, సముద్ర గస్తీ విమానం, హెలికాప్టర్లు, డ్రోన్లను మోహరించి ఆ ఆపరేషన్ చేసింది.
ఆదిత్య ఎల్1పై కూడా ప్రశసంలు..
ఇక ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టిన ఆదిత్య ఎల్1పై కూడా ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. ఇది దేశ శక్తి, శాస్త్రవేత్తల పరాక్రమానికి నిదర్శనమని మోదీ అన్నారు. ఆదిత్య ఎల్1, పదిహేను లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్1 పాయింట్‌లోకి ప్రవేశించిందని తెలిపారు. ఇది మన శాస్త్రవేత్తల అద్భుత పనితీరుకు నిదర్శమని కొనియాడారు. ఇదిలా ఉంటే ఆదిత్య ఎల్-1 హాలో కక్ష్య నుంచి సూర్యుడిని పరిశీలించనుంది. ఐదేళ్లపాటు భారత్‌కు సేవలు అందించనుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..