Today Petrol, Diesel Prices: పలు రాష్ట్రాల్లో ముడి చమురు ధరల్లో స్వల్ప తగ్గుదల.. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా..
అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన డిమాండ్ వంటి మొదలైన కారణాలు పెట్రోల్ - డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంధన ధరలో ఎక్సైజ్ సుంకం, వ్యాట్, డీలర్ కమీషన్ ఉంటాయి. వ్యాట్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది. ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ కలిపిన తర్వాత పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకపు ధర దాదాపు రెట్టింపు అవుతుంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. WTI ముడి చమురు సోమవారం ఉదయం గంటల ప్రాంతంలో క్షీణించింది. బ్యారెల్ $ 73.67 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్‌కు 78.66 డాలర్ల వద్ద కొద్దిగా తగ్గింది. దేశంలోని చమురు మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేశాయి.
భారతదేశంలో ఇంధన ధరలు ప్రతిరోజూ సమరిస్తుంటారు. జూన్ 2017కి ముందు ప్రతి 15 రోజులకు ఒకసారి ధర సవరణ జరిగింది. గుజరాత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు 56 పైసలు పెరిగాయి. జార్ఖండ్‌లో పెట్రోలు, డీజిల్ ధరలు 28 పైసలు పెరిగాయి. మధ్యప్రదేశ్, గోవా, ఒడిశాలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఛత్తీస్‌గఢ్‌లో పెట్రోల్‌పై 60 పైసలు, డీజిల్‌పై 59 పైసలు తగ్గాయి.
బీహార్‌లో పెట్రోల్ ధర 14 పైసలు, డీజిల్ ధర 13 పైసలు తగ్గింది. మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. ఇక పెద్ద నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధర – ఢిల్లీలో పెట్రోల్ రూ. 96.72. డీజిల్ లీటరు రూ. 90.08 ఉంది. అదే ముంబైలో పెట్రోల్ రూ.106.31, డీజిల్ రూ. 94.2 ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ రూ.106.03. లీటరు డీజిల్ 94.33. బెంగళూరులో పెట్రోలు రూ.101.94, డీజిల్ రూ. 87.89. ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ 109.66 ఉండగా, డీజిల్ రూ.97.82 వద్ద ఉంది.
అమెరికా డాలర్ తో రూపాయి మారకం విలువ, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిస్థితులు, ఇంధన డిమాండ్ వంటి మొదలైన కారణాలు పెట్రోల్ – డీజిల్ రేట్లను ప్రభావితం చేస్తాయి. ఇంధన ధరలో ఎక్సైజ్ సుంకం, వ్యాట్, డీలర్ కమీషన్ ఉంటాయి. వ్యాట్ ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది. ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ కలిపిన తర్వాత పెట్రోల్, డీజిల్ రిటైల్ అమ్మకపు ధర దాదాపు రెట్టింపు అవుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి