PM Modi: ఎన్నికల సభలో బాలుడి చేతిలోని చిత్రాన్ని చూసి కన్నీరు పెట్టుకున్న ప్రధాని మోదీ..!
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు ప్రధాని నరేంద్ర మోదీ. జనాల్లో కనిపిస్తున్న ఉత్సా,హం చూస్తుంటే జూన్ నాలుగున ఎలాంటి ఫలితం వస్తుందో స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈసారి బీజేపీ కూటమి కచ్చితంగా 400 సీట్లు సాధిస్తుందన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగసభలో ఎమోషనల్ అయ్యారు.

లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు ప్రధాని నరేంద్ర మోదీ. జనాల్లో కనిపిస్తున్న ఉత్సా,హం చూస్తుంటే జూన్ నాలుగున ఎలాంటి ఫలితం వస్తుందో స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈసారి బీజేపీ కూటమి కచ్చితంగా 400 సీట్లు సాధిస్తుందన్నారు. అయితే ఈ సందర్భంగా ప్రధాని మోదీ బహిరంగసభలో ఎమోషనల్ అయ్యారు. ప్రచార సభలో ఓ కుర్రోడు చూపించిన ఫొటోను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. దీంతో మోదీ ప్రసంగం మధ్యలో కొంతసేపు ఏమీ మాట్లాడకుండా ఉండిపోయారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా మధ్యప్రదేశ్ లోని దమోహ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి ఓ యువకుడు ప్రధాని మోదీపై అభిమానంతో తీసుకొచ్చిన చిత్రాన్ని చూసి మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. సభలో మాట్లాడుతుండగా దూరం నుంచి ఓ యువకుడి చేతిలో ఫొటోఫ్రేమ్ కన్పించింది. తన మాతృమూర్తి హీరాబెన్ తనను ఆశీర్వదిస్తున్న ఫొటో అది. పెన్సిల్‌తో గీసిన ఆ చిత్రాన్ని చూసిన ప్రధాని మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లిని గుర్తుచేసుకుని మాటలు రాక ప్రసంగాన్ని కొంతసేపు ఆపేశారు. ఆ తర్వాత చిత్రం తీసుకొచ్చిన యువకుడిని అభినందించారు. ఆ ఫొటో వెనక పేరు, చిరునామా రాసివ్వాలని అతడికి సూచించారు. తాను లేఖ రాస్తానని మోదీ అన్నారు. ఈ సన్నివేశంతో ఒక్కసారిగా సభకు వచ్చిన కార్యకర్తలంతా ఎమోషనల్‌కు గురయ్యారు.
మరోవైపు ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ టార్గెట్‌గా మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటమి భయంతో లోక్‌సభ ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయడం లేదని విమర్శించారు. వాయనాడులో రాహుల్‌గాంధీ ఓటమి ఖాయమన్నారు. ఏఫ్రిల్ 26వ తేదీ తరువాత రాహుల్‌గాంధీ రెండో స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటిస్తారని జోస్యం చెప్పారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆ పార్టీకి ఓటేయ్యడం లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…