PM Modi: ‘సమిష్టి ఎజెండాను రూపొందించడం అవసరం’.. G20 విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రధాని మోదీ..
బెంగళూరులో ప్రారంభమైన జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

మరింత సురక్షితమైన, విశ్వసనీయమైన, సమర్థవంతమైన పబ్లిక్ డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని సృష్టించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన డిజిటల్ చెల్లింపులు పర్యావరణ వ్యవస్థ, పాలన, ఆర్థిక, జీవనోపాధిని సమూలంగా మార్చిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. బెంగళూరులో ప్రారంభమైన జీ-20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ వినియోగదారులు, తయారీదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారని.. మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల స్ఫూర్తిని అందించాలని అన్నారు ప్రధాని మోదీ. మీ చర్చ ప్రపంచంలోని అత్యంత బలహీనమైన పౌరులపై దృష్టి పెట్టాలని తాను కోరుతున్నాని అన్నారు. గ్లోబల్ ఎకనామిక్ లీడర్‌షిప్ ఒక సమగ్ర ఎజెండాను రూపొందించడం ద్వారా మాత్రమే ప్రపంచ నమ్మకాన్ని తిరిగి పొందగలుగుతుందని సూచించారు ప్రధాని మోదీ.
భారతీయ వినియోగదారులు భవిష్యత్తు గురించి ఆశాజనకంగా, నమ్మకంగా ఉన్నారు. మీరు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అదే సానుకూల వైఖరిని అందిస్తారని ఆశిస్తున్నామని ఈ సందర్భంగా ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
कर्नाटक: केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण, आरबीआई गवर्नर शक्तिकांत दास बेंगलुरु में पहली G20 ‘वित्त मंत्रियों और सेंट्रल बैंक गवर्नर्स’ की बैठक में शामिल हुए। pic.twitter.com/AGIDiDi1yW
— ANI_HindiNews (@AHindinews) February 24, 2023
కోవిడ్ మహమ్మారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. అనేక దేశాలు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు, ఇప్పటికీ ఆ పరిణామాలను ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. మా G20 ఛైర్మన్‌షిప్ సమావేశానికి వచ్చిన గ్లోబల్ G20 గెస్ట్‌లు UPIని ఉపయోగించడానికి అనుమతించే కొత్త ఫిన్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించామని.. ఇది భారత డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫారమ్ అని అన్నారు.
బెంగళూరులో జరిగిన జీ20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల తొలి సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పాల్గొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం