PM Modi: ఈశాన్య రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్.. నాగలాండ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నాగలాండ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం చుమౌకెడిమా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసగించారు...

ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌లో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ నాగలాండ్ పర్యటనకు వెళ్లారు. శుక్రవారం చుమౌకెడిమా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసగించారు. నాగాలాండ్‌కు బీజేపీ మంత్రం.. శాంతి, ప్రగతి మరియు శ్రేయస్సు అని అందుకే ప్రజల్లో బీజేపీపై విశ్వాసం పెరుగుతోందని మోదీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో సాంకేతిక సహాయంతో బీజేపీ అవినీతిని అరకట్టిందని మోదీ తెలిపారు. పీఎం కిస్సాన్ సమాన్ నిధి పథకం ద్వారా రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా డబ్బు జమ అవుతుందని మోదీ తెలిపారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఎన్‌డీపీపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ర్యాలీలో పాల్గొనేకంటే ముందు నాగాలాండ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నీఫియు రియో.. దిమాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని సాదరంగా ఆహ్వానించారు.




ఇదిలా ఉంటే కాంగ్రెస్ పార్టీపై మోదీ మరోసారి ఫైర్ అయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్ నాయకులు ఏనాడు నాగాలాండ్ వైపు చూడలేదని, రాష్ట్రంలో శాంతి, అభివృద్దికి ఎన్నడూ ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ నాగాలాండ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్‌లో నడిపించందని ప్రధాని ఆరోపించారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు పాల్పడుతోందనన్నారు. నాగాలాండ్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారన్నని చెప్పుకొచ్చారు. నేడు కేంద్ర ప్రభుత్వం నాగాలాండ్‌లో వేలాది కుటుంబాలకు ఉచిత రేషన్ ఇస్తోందన్న ప్రధాని.. కాంగ్రెస్ పార్టీ లాగా ఈశాన్య రాష్ట్రాల్లోని 8 రాష్ర్టాలను ఏటీఎంలుగా పరిగణించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని చురకలు అంటించారు.
Nagaland CM Neiphiu Rio felicitates PM Narendra Modi ahead of his public address, in Dimapur pic.twitter.com/fIs2IxvzRQ
— ANI (@ANI) February 24, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..