PM Modi: రైతులకు మోదీ గిఫ్ట్.. ఆ రోజున అకౌంట్లలో డబ్బు జమ..
PM Kisan: ప్రధాని మోడీ పీఎం కిసాన్ 21వ విడత నిధులను నవంబర్ 19న విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.2000 జమ అవుతాయి. ఇప్పటివరకు రూ.3.70 లక్షల కోట్లకు పైగా పంపిణీ చేశారు. రైతుల జీవితాలపై గణనీయమైన ప్రభావం చూపిన ఈ పథకం గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడింది. అర్హులైన వారికి ప్రయోజనాలు చేరేలా రైతు రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ప్రధాని మోదీ దేశంలోని లక్షలాది మంది రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. నవంబర్ 19న కిసాన్ సమ్మాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు.ఈ పథకం కింద అర్హత కలిగిన ప్రతి రైతు కుటుంబానికి ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ మొత్తం ఏడాదికి మూడు విడతలుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. 21వ విడతలో భాగంగా రైతుల అకౌంట్లలో రూ.2వేల చొప్పున వేయనున్నారు.
ఇప్పటివరకు అందిన సహాయం ఎంత?
పీఎం కిసాన్ పథకం ఫిబ్రవరి 24, 2019న ప్రారంభించబడింది. ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా 110 మిలియన్లకు పైగా రైతు కుటుంబాలకు 20 విడతలుగా మొత్తం రూ.3.70 లక్షల కోట్లకు పైగా నిధులను అందజేశారు. ఈ నిధులు రైతులకు అవసరమైన వ్యవసాయంతో పాటు ఇతర అవసరాలకు ఎంతగానో సహాయపడ్డాయి. పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు మరింత పారదర్శకంగా రైతులకు చేరడానికి.. భూమి వివరాలు, బ్యాంక్ ఖాతాలు ఆధార్‌తో లింక్ అయిన వారి అకౌంట్లలో మాత్రమే డబ్బులు జమ అవుతాయి.
కొత్తగా రైతు రిజిస్ట్రీ
పీఎం కిసాన్ పథకం రైతుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయ ఆహార, విధాన పరిశోధన సంస్థ 2019లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఈ పథకం కింద పంపిణీ చేసిన నిధులు గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడ్డాయని.. రైతులకు రుణ పరిమితులను తగ్గించడంలో సహాయపడిందని స్పష్ చేసింది. పీఎం కిసాన్ ప్రయోజనాలు చివరి అర్హులైన ప్రతి రైతుకు చేరేలా చూడటానికి, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకుంటుంది. రైతుల కోసం డేటాబేస్‌ను రూపొందించడానికి రైతు రిజిస్ట్రీని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రైతులకు ఎక్కవ ఇబ్బందులు తప్పుతాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




