పీఎం కేర్స్ ఫండ్ కి మోదీ విరాళం రూ. 2.25 లక్షలు

పీఎం కేర్స్ ఫండ్ కి ప్రధాని మోదీ స్వయంగా తన సొంత జేబు నుంచి రూ. 2.25 లక్షల విరాళం ఇచ్చారని ప్రధానమంత్రి కార్యాలయవర్గాలు తెలిపాయి.

పీఎం కేర్స్ ఫండ్ కి మోదీ విరాళం రూ. 2.25 లక్షలు
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 03, 2020 | 2:15 PM

పీఎం కేర్స్ ఫండ్ కి ప్రధాని మోదీ స్వయంగా తన సొంత జేబు నుంచి రూ. 2.25 లక్షల విరాళం ఇచ్చారని ప్రధానమంత్రి కార్యాలయవర్గాలు తెలిపాయి. ఈ ఫండ్ ని ఏర్పాటు చేయగానే తొలి కార్పస్ ఫండ్ గా ఈ సొమ్మును అందజేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఫండ్ కింద సేకరించిన నిధులను కరోనా వైరస్ పై పోరులో అత్యవసర సందర్భాల్లో వినియోగించనున్నారు. బాలికల విద్య నుంచి గంగానది ప్రక్షాళన వరకు వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రధాని డొనేషన్లు ఇస్తున్నారని ఈ వర్గాలు చెప్పాయి. మొత్తం విరాళాలు రూ. 103 కోట్లకు చేరుకున్నట్టు వివరించాయి.

పీఎం కేర్స్ ఫండ్ కు అసలు చట్టబధ్ధత  ఉందా అని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ప్రశిస్తున్న వేళ.. పీఎంఓ ఈ ప్రకటన చేసింది.