నిందితుడు ఎలాంటి సానుభూతికి అర్హుడు కాడు
మూడేళ్ల కిందట గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకు గురయ్యాడు.. ఆ హత్య చేసింది కూడా ఆ స్కూల్‌లోని 11వ తరగతి చదువుతున్న విద్యార్థే! హత్యారోపణలను ఎదుర్కొంటున్న ఆ టీనేజర్ బెయిల్ ఇవ్వడానికి కుదరంది సుప్రీంకోర్టు.
మూడేళ్ల కిందట గుర్గావ్‌లోని రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఏడేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్ హత్యకు గురయ్యాడు.. ఆ హత్య చేసింది కూడా ఆ స్కూల్‌లోని 11వ తరగతి చదువుతున్న విద్యార్థే! హత్యారోపణలను ఎదుర్కొంటున్న ఆ టీనేజర్ బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ వస్తున్నాడు.. అన్ని చోట్లా బెయిల్ ఇవ్వడానికి కుదరదన్నాయి.. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా అదే మాట చెప్పింది.. జస్టిస్ ఆర్.ఎఫ్.నారిమన్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పంజాబ్-హర్యానా హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టేసింది.. హైకోర్టు ఇచ్చిన తీర్పులో కలగజేసుకోవడానికి తమకు ఏ కారణమూ కనిపించడం లేదని ధర్మాసనం సృష్టం చేసింది.. అందుకే కేసును కొట్టేస్తున్నామని చెప్పింది..
నిందితుడి బెయిల్ పిటిషన్‌ను మొన్న జూన్‌లో పంజాబ్-హర్యానా హైకోర్టు కొట్టేసింది.. జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 12 కింద పిటిషనర్‌కు ఉపశమనం లభిస్తుందో లేదో తెలుసుకోవడానికి కోర్టుకు తక్కువ అవకాశం ఉందంటూ హైకోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. 2017 సెప్టెంబర్ 8 న ఈ హత్య జరిగింది.. పరీక్షలు వాయిదా పడటం కోసం స్కూల్‌లో చదువుతున్న ఏడేళ్ల ప్రద్యుమ్న ఠాకూర్‌ను గొంతుకోసి హత్య చేశాడు 11వ తరగతి చదువుతున్న విద్యార్థి. స్కూల్ టాయిలెట్ వెలుపల రక్తపు మడుగులో ఉన్న ఆ చిన్నారి శవాన్ని మొదట స్కూల్ గార్డ్‌నర్ గుర్తించాడు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించింది.. సీబీఐ లోతుగా దర్యాప్తు జరిపి సీనియరే ఈ హత్య చేశాడని తేల్చింది.. ఈ విషయాలను సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొంది. కేసు విచారిస్తున్న సీబీఐ బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించింది. నిందితుడు ఎటువంటి సానుభూతికి అర్హుడు కాదని పేర్కొంది.