మీ పెద్దమనసుకు నమస్కరిస్తున్నా: పవన్
తన అభిమానులు ప్లెక్సీ కడుతూ ప్రమాదవశాత్తూ చనిపోయిన ఘటనపై స్పందించి సాయం అందించిన అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. 'కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి.......
తన అభిమానులు ప్లెక్సీ కడుతూ ప్రమాదవశాత్తూ చనిపోయిన ఘటనపై స్పందించి సాయం అందించిన అందరికీ పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ‘కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు – శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు’. అని పవన్ తన సందేశంలో పేర్కొన్నారు. కాగా, సెప్టెంబర్ 2 పవన్ కల్యాణ్ పుట్టినరోజు పురస్కరించకొని చిత్తూరు జిల్లా శాంతిపురంలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు పవన్ అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. 25 అడుగుల ఎత్తున బ్యానర్ కడుతుండగా సోమశేఖర్, రాజేంద్ర, అరుణాచలం విద్యుత్ వైర్లు తగిలి చనిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చనిపోయిన, గాయపడిన బాధితుల కుటుంబాలకు పవన్ తోపాటు, చరణ్, బన్నీ, ఎఎమ్ రత్నం, మైత్రీ మైవీస్ తోపాటు, స్థానిక జనసేన నాయకులు, అభిమానులు తమ వంతు ఆర్థిక సాయాన్ని ప్రకటిస్తూ బాసటగా నిలుస్తున్నారు.
కుప్పం దుర్ఘటనలో గాయపడ్డ వారిని, చనిపోయిన వారి కుటుంబాల్ని ఆదుకోవటానికి ముందుగా మానవతా దృక్పథంతో స్పందించిన శ్రీ రాంచరణ్ కి; అలాగే పెద్దమనుసు తో ముందుకు వచ్చిన శ్రీ అల్లు అర్జున్ కి,నిర్మాతలు – శ్రీ దిల్ రాజు, శ్రీ ఏ.ఎమ్ రత్నం , మైత్రి మూవీస్ శ్రీ నవీన్ గార్లకు,నా కృతజ్ఞతలు?.
— Pawan Kalyan (@PawanKalyan) September 3, 2020
మృతి చెందిన జనసైనికుల కుటుంబాలకు అండ. pic.twitter.com/N7Z50sveCT
— JanaSena Party (@JanaSenaParty) September 3, 2020
జనసేన కుటుంబ సభ్యులను కోల్పోయాం – Sri @mnadendla pic.twitter.com/9QqxLMweJq
— JanaSena Party (@JanaSenaParty) September 2, 2020