AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi: వారికి రక్షణ కల్పించండి.. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు!

వేసవి వచ్చిందంటే చాలు చల్లటి ప్రాంతాల్లో సేదతీరెందుకు, ఆధ్యాత్మిక పర్యటనలకు కేరాఫ్ అడ్రస్ భూతల స్వర్గం కాశ్మీర్.. అలాంటి కాశ్మీర్ ఇప్పుడు అట్టుడుకుతోంది. కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది పర్యాటకులు చనిపోవడంతో.. పర్యాటకులు కాశ్మీర్‌ వెళ్లాలంటేనే భయపడే సరిస్థితి నెలకొంది.

Delhi: వారికి రక్షణ కల్పించండి.. పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలు!
Supreme Court Of India
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Apr 23, 2025 | 2:45 PM

Share

కాశ్మీర్‌లో ఎప్పుడు లేని విధంగా పర్యాటకులపై ఉగ్రవాదులు నర మేధం సృష్టించడంతో పర్యాటకుల భద్రత,రక్షణపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పర్యాటకుల భద్రత,రక్షణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. కొండ, పర్వత ప్రాంతాల్లో పర్యాటకుల భద్రత పెంచేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలంటూ పిటిషనర్‌ పేర్కొన్నారు. పర్యాటకులు పెద్దఎత్తున గుమికూడే ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించేలా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు న్యాయవాది విశాల్ తివారీ.

జులై నెలలో ప్రారంభం అయ్యే అమర్‌నాథ్ యాత్రకు భద్రత, పర్యాటకులకు రక్షణ కల్పించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని న్యాయవాది శిశాల్‌ తివారీ పేర్కొన్నారు. పర్యాటక ప్రదేశాలలో, మారుమూల కొండలు లోయ ప్రాంతాలలో సరైన వైద్య సదుపాయాలను ఏర్పాటు చేసి, అత్యవసర సమయంలో తక్షణ వైద్య సహాయం అందించాలని కోరాడు. వేసవి కాలంలో అధిక సంఖ్యలో పర్యాటకులు కొండ ,పర్వత ప్రాంతాలు సందర్శిస్తుండటంతో ఉత్తర భారతదేశంలోని చాలా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా పర్యాటక రంగంపైనే ఆధారపడి ఉందని ఉగ్రవాదుల దాడులు పర్యాటక రంగం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతాయని పర్యాటకుల రక్షణకు భద్రతా చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యమని న్యాయవాది శిశాల్ తివారీ పేర్కొన్నారు.

తాజాగా జరిగిన పహల్‌గావ్ దాడిలో భద్రతా ఏర్పాట్లేమీ లేవని భద్రతా చర్యల ద్వారా మాత్రమే ఉగ్రవాదుల దాడుల నుండి పర్యాటకులను రక్షించగలమని విశాల్ తివారి పిల్‌ ద్వారా కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 25న తన పిల్ పై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కోరారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…