Alaknanda Colour : ఉత్తరాకాండ్‌లోని వరదల బీభత్సంతో నీటి రంగు మార్చుకున్న అలకనందా నది.. ఫోటోలు వైరల్

భారత దేశంలో నదులకు ప్రత్యేక స్థానం ఉంది.. వాటిని దేవతలుగా భావించి పూజిస్తారు.. ఇక దేశంలో ఉన్న నదుల్లోని నీరు ఒక ఎత్తైతే.. అలకనందా నది నీరు ఒక ఎత్తు.. నీలం, పచ్చరంగుల కలయికతో ఏ నదినీరు కలిసినా...

Alaknanda Colour : ఉత్తరాకాండ్‌లోని వరదల బీభత్సంతో నీటి రంగు మార్చుకున్న అలకనందా నది.. ఫోటోలు వైరల్
Follow us
Surya Kala

|

Updated on: Feb 21, 2021 | 6:55 AM

Alaknanda Colour : భారత దేశంలో నదులకు ప్రత్యేక స్థానం ఉంది.. వాటిని దేవతలుగా భావించి పూజిస్తారు.. ఇక దేశంలో ఉన్న నదుల్లోని నీరు ఒక ఎత్తైతే.. అలకనందా నది నీరు ఒక ఎత్తు.. నీలం, పచ్చరంగుల కలయికతో ఏ నదినీరు కలిసినా తన స్వరూపాన్ని రంగును మార్చుకోకుండా తన ప్రత్యేకతను చాటుకుంది ఇప్పటి వరకూ .. అయితే తాజాగా అలకనందా నది నీరు వరదలకు ముందు.. తర్వాత అంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌లో సృష్టించిన వరదల బీభత్సంలో అలకనంద నది ఎలా మారిందో తెలుసా? అంటూ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఉత్తరాఖండ్ పొట్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఏడాది జనవరి చివరి వారంలో అలకనంద నదిని ఫొటో తీసింది. ఈ ఫొటోలో నది నీరు శుభ్రంగా, నీలం-పచ్చరంగు కలయికలో కనిపిస్తున్నాయి. ఈ ఫొటో దేవప్రయాగ వద్ద తీశారు. మొన్న వచ్చిన వరదల తర్వాత అదే ప్రాంతంలో తీసిన ఫొటోల్లో అలకనంద స్వరూపం మారిపోయింది. బురదనీటితో నిండిపోయి కనిపించింది.

Also Read:

ఉత్తరభారతంలో కొనసాగుతన్న మంత్రి వేముల పర్యటన.. ధోల్పూర్ రాతిని పరిశీలించిన మంత్రి బృందం

పోలవరం ప్రాజెక్టును రెండో రోజు పరిశీలించిన డ్యాం డిజైన్ కమిటీ.. ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పేసిన కమిటీ చైర్మన్ ఏ బి.పాండ్యా