AP Panchayat Election 2021 Phase 4:ఎన్నికల హామీలను రూ. 20 బాండ్ పై రాసి నోటరీ చేయించిన అభ్యర్థి ఎక్కడంటే..!

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఆటలను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను వెలికి తీస్తున్నారు. తాజాగా ఓ అభ్యర్థి ఏకంగా ఎన్నికల హామీలను బాండ్ పేపర్ పై రాసి ..

AP Panchayat Election 2021 Phase 4:ఎన్నికల హామీలను రూ. 20 బాండ్ పై రాసి నోటరీ చేయించిన అభ్యర్థి ఎక్కడంటే..!
Follow us
Surya Kala

| Edited By: Shiva Prajapati

Updated on: Feb 21, 2021 | 8:50 AM

AP Panchayat Election 2021 Phase 4: ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వద్ద ఉన్న అస్త్రశస్త్రాలను వెలికి తీస్తున్నారు. తాజాగా ఓ అభ్యర్థి ఏకంగా ఎన్నికల హామీలను బాండ్ పేపర్ పై రాసి సంచలనం సృష్టించారు.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం మండలం ఊబలంకలో బీసీ మహిళకు రిజర్వ్‌ . దీంతో అక్కడ సర్పంచ్ బరిలో మేడిశెట్టి సురేఖ సర్పంచి నిలబడింది. ఇక ఈ గ్రామంలో ఉన్న ఏడు వార్డులకు ఏడుగురు అభ్యర్థులు ఒక వర్గంగా నిలబడి పోటీ చేస్తున్నారు. అయితే మూడవ వార్డు తరుపున పోటీ చేస్తున్న పడాల రంగారెడ్డి అనే వ్యక్తి తమ వర్గాన్ని గెలిపించమని గ్రామస్థులను కోరారు. ఇందుకోసం ఐదు హామీలను సైతం ఇచ్చారు. అవి ఏమిటంటే..

గ్రామస్థులందరికీ ఏడాది పాటు కేబుల్‌ ప్రసారాలు, రేషన్‌, మినలర్‌ వాటర్‌ ఉచితంగా ఇస్తానని చెప్పారు. అంతేకాదు బీపీ షుగర్‌ పరీక్షలను కూడా ఉచితంగా చేయిస్తానని తెలిపారు. ఇక చదువులో మంచి ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు ఒకొక్కరికి రూ. 10 వేలు చొప్పున ఇస్తానని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ మహీళను ఏకంగా రూ. 20 బాండ్ పేపర్ ముద్రించి నోటరీ చేయించారు. అలా 14 బాండ్ లను తయీరు చేయించి 14 వార్డుల్లో ఉన్న పెద్దలకు అందజేశారు. ఇక రాజానగరం పరిధిలో గత ఎన్నికల్లో ఏకంగా తనకు ఓటు వేస్తె ప్రభుత్వ పథకాలు నిలిపేస్తే.. తన రెండు ఎకరాల భూమిలో ఒక ఎకరం ఇల్లు కట్టుకోవడానికి ఇస్తానని చెప్పి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఇక నాలుగో విడతలో 33 ,435 వార్డులకు గానూ.. 10 ,921 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. దీంతో మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలలోని, 16 రెవిన్యూ డివిజన్ల పరిధిలో 161 మండలాలలో తుది విడత ఎన్నికలు జరగనున్నాయి.

Also Read:

AP Panchayat Elections 2021 live: ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీ ఎన్నికలు.. నాలుగో విడత పోలింగ్ ప్రారంభం..

ఏపీలో నేడు ఆఖరి దశ పంచాయతీ ఎన్నికలు.. ఓటు హక్కు వినియోగించుకోనున్న 67.75 లక్షల మంది ఓటర్లు

పంచాయతీ ఎన్నికల చివరి దశలో టీడీపీకి షాక్‌.. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న అక్కడి అభ్యర్థులు