పంచాయతీ ఎన్నికల చివరి దశలో టీడీపీకి షాక్‌.. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న అక్కడి అభ్యర్థులు

ఏపీలో పంచాయతీ ఎన్నికల చివరి దశలో పార్టీలపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు..

పంచాయతీ ఎన్నికల చివరి దశలో టీడీపీకి షాక్‌.. ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు పేర్కొన్న అక్కడి అభ్యర్థులు
K Sammaiah

|

Feb 21, 2021 | 6:04 AM

ఏపీలో పంచాయతీ ఎన్నికల చివరి దశలో పార్టీలపై అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా గంపలగూడెం మండలం పెనుగోలు టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. టీడీపీ బలపరిచిన గ్రామ సర్పంచి అభ్యర్థి సంగెపు జ్యోతి ఎన్నికలు బహిష్కరిస్తున్నట్లు మీడియాకు వెల్లడించారు.

టీడీపీ అధిష్టానం తమను మోసాగించిందని అంటున్నారు జ్యోతి. 14 వార్డు నెంబర్లు పోటీల్లో నుండి బహిష్కరిస్తున్నట్లు వివరించారు. టీడీపీ ఎలక్షన్ లో తమకు ఆర్థిక సహాయం అందజేస్తామని చెప్పిన నాయకులు తమను పట్టించుకోలేదని మండిపడ్డ పోటీలోని అభ్యర్థులు. పార్టీ వ్యవహార శైలికి నిరసనగా ఎన్నికలు బహిష్కరిస్తున్నామన్నారు.టీడీపీ వైఖరికి నిరసిస్తూ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేస్తున్నానని కోటా హరిబాబు ప్రకటించారు.

Read more:

బాహాబాహీకి దిగిన అధికార పార్టీ నేతలు.. అక్కడ ఓటమికి నువ్వంటే నువ్వే కారణమని ఘర్షణ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu