బాహాబాహీకి దిగిన అధికార పార్టీ నేతలు.. అక్కడ ఓటమికి నువ్వంటే నువ్వే కారణమని ఘర్షణ

ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ముగిసిన మూడు దశల ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ మద్దతుదారులు..

బాహాబాహీకి దిగిన అధికార పార్టీ నేతలు.. అక్కడ ఓటమికి నువ్వంటే నువ్వే కారణమని ఘర్షణ
Follow us
K Sammaiah

|

Updated on: Feb 21, 2021 | 12:37 AM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ముగిసిన మూడు దశల ఎన్నికల్లో అధికారపార్టీ వైసీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొంది సత్తా చాటారు. ఇక నాలుగో దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది ఈ నేపథ్యంలో ప్రకాశంజిల్లా కొండపిలో గెలుపొందిన వైసిపి సర్పంచ్‌ల అభినందన సభలో గందరగోళం నెలకొంది.

టంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో వైసిపి ఓటమికి నువ్వంటే నువ్వంటూ వేదికపై కొంతమంది నేతలు గొడవకు దిగారు. కొండపి వైసిపి ఇన్‌చార్జి మాదాసు వెంకయ్య సర్దిచెబుతున్నా వినకుండా వాగ్వివాదానికి దిగారు. అనంతరం సభ నుంచి బయటకు వచ్చినా రోడ్డుపై కొట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఒకరిపై ఒకరు బూతులు తిట్టుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అనంతరం ఇరువర్గాలకు నేతలు సర్దిచెప్పి పంపించివేశారు. సంబరాలు చేసుకోవాల్సాని అధికార పార్టీ నేతలు ఇలా బాహాటంగా బాహాబాహీకి దిగడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.