ఉత్తరభారతంలో కొనసాగుతన్న మంత్రి వేముల పర్యటన.. ధోల్పూర్ రాతిని పరిశీలించిన మంత్రి బృందం
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రెండోరోజు ఆగ్రా పరిసర ప్రాంతాల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం పర్యటించింది. నూతన సచివాలయ..
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నూతన సెక్రటేరియట్ కోసం వినియోగించే రాతి కోసం రెండోరోజు ఆగ్రా పరిసర ప్రాంతాల్లో రాష్ట్ర రోడ్లు-భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం పర్యటించింది. పర్యటన లో భాగంగా తాజ్ మహల్,రెడ్ ఫోర్ట్ లను మంత్రి బృందం పరిశీలించింది.కట్టడాలకు వాడిన రాతి గురించి మంత్రి వేములకు అక్కడి అధికారులు వివరించారు.
అనంతరం…ధోల్పూర్,బారి,సిర్మతురా,కార్వాలి ప్రాంతాల్లోని ధోల్పూర్ స్టోన్ క్వారీలను కలియతిరిగారు.అక్కడి క్వారీల్లోకి స్వయంగా వెళ్లి ధోల్పూర్ క్వాలిటీ పరిశీలించారు.క్వారీల్లో స్టోన్ లభ్యత,నాణ్యత గురించి క్వారీ సిబ్బందిని,అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు.హీనపూర్ ప్రాంతంలోని రెడ్ స్టోన్,ఖేద ప్రాంతంలోని బిజు స్టోన్ ను పరిశీలించారు.ఉదయం 7గంటలకు మొదలైన మంత్రి బృందం పర్యటన రాత్రి సమయం వరకు నిర్విరామంగా కొనసాగింది.ఆయా ప్రాంతాల్లోని వివిధ స్టోన్ లభ్యత క్వారీలను సందర్శించారు.
మంత్రి వెంట ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి,ఈ.ఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, షాపూర్ జి సంస్థ ప్రతినిధి లక్ష్మణ్ ఉన్నారు. నేడు (ఆదివారం)మూడో రోజు పర్యటనలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బృందం రాజస్థాన్ లోని జైపూర్ లో పలు ప్రాంతాలను సందర్శించనున్నది.
Read more: