AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్.. మరిన్ని కీలక అప్‌డేట్స్

Hijab Row News: సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకి ముందు హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో కర్నాటక రాష్ట్రంతో పాటు యావత్ దేశం అట్టుడికింది.

Hijab Row: హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్.. మరిన్ని కీలక అప్‌డేట్స్
Supreme Court Of India
Janardhan Veluru
|

Updated on: Mar 15, 2022 | 7:21 PM

Share

Hijab Row News: సరిగ్గా ఐదు రాష్ట్రాల ఎన్నికలకి ముందు హిజాబ్‌ అనుకూల, వ్యతిరేక ఆందోళనలతో కర్నాటక రాష్ట్రంతో పాటు యావత్ దేశం అట్టుడికింది. ఎన్నికలకి ముందు హిజాబ్‌ యావత్‌ దేశంలో రాజకీయ వేడిని రగుల్‌కొల్పిందనడంలో సందేహం లేదు. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఇప్పుడు ఈ వ్యవహారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకి చేరుకుంది. కర్ణాటక హైకోర్టు తీర్పుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలయ్యింది.

హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు తీర్పు నేపథ్యంలో చోటుచేసుకున్న కీలక పరిణామాలు. 

  1. ఎక్కడో ఉడిపిలో అంటుకున్న హిజాబ్ నిప్పు ఇటు కర్నాటక నుంచి అటు కశ్మీర్‌ వరకు కాంట్రవర్సీ కాకరేపింది. యావత్‌ సమాజాన్ని అట్టుడికించింది. ఓ రకంగా చెప్పాలంటే ఎన్నికలకి హిజాబ్‌ రాజకీయ రంగునద్దింది. కేవలం కర్నాటక మాత్రమే కాదు పక్క రాష్ట్రమైన ఏపీ, తెలంగాణాల్లోనూ హిజాబ్‌ కాంట్రవర్సీ రాజకీయ దుమారాన్ని రేపింది.
  2. తాజా తీర్పుపై మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. హిజాబ్‌పై కర్నాటక హైకోర్టు తీర్పు రాజ్యాంగ విరుద్దమన్నారు అసుదుద్దీన్‌ ఒవైసీ. హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుతో తాను ఏకీభవించడం లేదని, తీర్పుతో విభేదించే హక్కు తనకుందని వ్యాఖ్యానించారు. మతవిశ్వాసాలను కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. హిజాబ్‌ బ్యాన్‌పై సుప్రీంకోర్టులో అప్పీల్‌కు వెళ్లాలని పిటిషనర్లకు ఒవైసీ పిలుపునిచ్చారు.
  3. హిజాబ్‌ ఇష్యూపై కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాజాగా హైకోర్టు తీర్పుపై కూడా ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. యిది మతపరమైన అంశం కాదని, తాము ఏం ధరించాలో నిర్ణయించుకునే చాయిస్‌కి సంబంధించిన విషయమని తేల్చి చెప్పారు.
  4. ప్రతి మతానికీ ఈ దేశంలో సమానమైన హక్కులుంటాయంటున్నారు హిజాబ్‌ కోసం ఆందోళన బాటపట్టిన విద్యార్థినులు. ఈ దేశ రాజ్యాంగంపైనా, న్యాయస్థానాలపైనా సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నారు. సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని హిజాబ్ ఉద్యమకారిణి ముస్కాన్‌ పేర్కొన్నారు.
  5. అయితే బీజేపీ నేతలు కోర్ట్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హైకోర్ట్‌ ఆదేశాలను పాటించి శాంతిని కాపాడాలని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి అన్నారు. విద్యార్థులకు చదువు ప్రధానమని, అన్ని విషయాలను పక్కనబెట్టి చక్కగా చదువుకోవాలని సూచించారు.
  6. మరోవైపు హైకోర్ట్‌ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్నారు కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై. ప్రతి ఒక్కరూ హైకోర్ట్‌ ఆదేశాలు పాటించాలన్నారు..శాంతిని కాపాడాలని..విద్యార్థులంతా చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
  7. హిజాబ్‌ ఇష్యూ మరోమారు కాంట్రవర్సీ కాకూడదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా బెంగుళూరు సహా కర్నాటకలోని కొన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్‌ విధించింది. మార్చి 15 నుంచి మార్చి 19 వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. హిజాబ్‌ రగడ ప్రారంభమైన ఉడుపిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.

Also Read..

Viral Video: పంతం నీదా.. నాదా హేయ్.. అంటూ రెచ్చిపోయిన అడవి దున్నలు.. వైరల్ అయిన వీడియో..

AP CM YS Jagan: రెండేళ్లలో పరీక్షా సమయం రాబోతోంది.. అంతా సిద్ధంగా ఉండాలిః సీఎం వైఎస్ జగన్