Bharat Ratna: వారికి భారత రత్న పురస్కారం ఇవ్వాల్సిందే.. తెర మీదకొచ్చిన కొత్త పేర్లు

పెరియార్, అన్నాదురై, జయలలితలకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని అన్నా డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు ఈ నెల 11న జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించడం కొత్త చర్చకు కారణమవుతోంది.

Bharat Ratna: వారికి భారత రత్న పురస్కారం ఇవ్వాల్సిందే.. తెర మీదకొచ్చిన కొత్త పేర్లు
Bharat Ratna AwardImage Credit source: TV9 Telugu
Follow us

|

Updated on: Jul 06, 2022 | 12:08 PM

Bharat Ratna Award: దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘భారత రత్న’ చుట్టూ మళ్లీ చర్చ మొదలయ్యింది. పెరియార్, అన్నాదురై, జయలలితలకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలని అన్నా డీఎంకే డిమాండ్ చేస్తోంది. ఆ మేరకు ఈ నెల 11న జరిగే పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయనున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించడం కొత్త చర్చకు కారణమవుతోంది. సంఘ సంస్కర్త పెరియార్ (ఈవీ రామస్వామి నాయకర్)కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న డిమాండ్‌ను కొందరు సమర్థిస్తుండగా.. కొందరు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. హిందూ దేవుళ్లను, దేశ స్వాతంత్రాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఆయనకు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వకూడదని సోషల్ మీడియా వేదికగా తమ గళాన్ని వినిపిస్తున్నారు. జయలలితకు భారత రత్న ప్రదానం చేయాలని అన్నాడీఎంకే కార్యకర్తలు.. కరుణానిధికి భారత రత్న ఇవ్వాలని డీఎంకే శ్రేణులు బలంగానే డిమాండ్ చేస్తున్నారు.

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలై లామాను భారత రత్న పురస్కారంతో గౌరవించాలని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి శాంత కుమార్ మంగళవారంనాడు కేంద్రాన్ని కోరారు. నోబెల్ శాంతి బహుమతి సహా పలు అత్యున్నత పురస్కారాలు అందుకున్న ఆయన భారత రత్న పురస్కారానికి అర్హులని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన శాంత కుమార్ అభిప్రాయపడ్డారు. దలైలామా ఇవాళ (జులై 6) 87వ జన్మదినాన్ని జరుపుకుంటున్న సందర్భంగా శాంత కుమార్ ఈ విజ్ఞప్తి చేశారు.

మొన్నటికి మొన్న గొప్ప కళాకారుడైన ఎస్వీ రంగారావు జయంతి సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని ఆయన అభిమానులు డిమాండ్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన ఆకాంక్షను వ్యక్తంచేశారు. తెలుగు వెలుగులు ఎన్టీ రామారావు, పీవీ నరసింహరావు, పింగళి వెంకయ్య, ఘంటసాల తదితరులకు భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలన్న డిమాండ్ తెలుగునాట చాలాకాలం నుంచి వినిపిస్తున్నదే. మొన్న ఆ మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలన్న డిమాండ్ కూడా ఆయన అభిమానుల నుంచి వినిపించింది.

ఇవి కూడా చదవండి

ప్రముఖ జాతీయవాద నాయకుడైన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని కోరుతూ రెండు వారాల క్రితం ప్రధాని నరేంద్ర మోడీకి బీజేపీ ఎంపీ హరినాథ్ సింగ్ యాదవ్ లేఖ రాశారు. ప్రధానికి రాసిన ఆ లేఖలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవల గురించి వివరించారు. అటు వీర్ సావర్కర్‌కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న డిమాండ్ కూడా చాలా కాలంగా వినిపిస్తోంది.

దేశానికి ఎంతో సేవ చేసిన రతన్ టాటాకు భారత రత్న పురస్కారాన్ని ప్రదానం చేయాలని తరచూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అటు భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలంటూ కొన్ని నెలల క్రితం సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. మరోవైపు లోక్‌జన శక్తి (ఎల్జేపీ) వ్యవస్థాపకుడు ధివంగత రాం విలాస్ పాశ్వాన్‌కు భారత రత్న పురస్కారాన్ని ఇవ్వాలన్న డిమాండ్ గత కొంతకాలంగా బీహార్‌లో బలంగా వినిపిస్తోంది.

కరోనా సంక్షోభ సమయంలో పేదలకు అండగా నిలిచిన కళియుగ కర్ణుడు సోనూ సూద్, కోట్లాది రూపాయలు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్న నటుడు అక్షయ్ కుమార్‌కు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ మొన్న ఆ మధ్య తెరమీదకు వచ్చింది. హిందీ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రదానం చేయాలని ఆయన అభిమానులతో పాటు స్వయంగా ఆయన సతీమణి సైరా బాను గత నెల డిమాండ్ చేశారు.

సచిన్ టెండుల్కర్‌కు ప్రదానం చేసిన భారత రత్న పురస్కారాన్ని విరాట్ కోహ్లీ, వీరేంద్ర సెహ్వాగ్, ఎంఎస్ ధోనీ, వీవీఎస్ లక్ష్మణ్‌లకు ఈ దేశ అత్యున్నత పురస్కారాన్ని ఎందుకు ఇవ్వరంటూ బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి మొన్న ఆ మధ్య ప్రశ్నించారు. క్రీడా రత్నాలు ధ్యాన్ చంద్, మిల్కా సింగ్‌కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలన్న డిమాండ్ కూడా క్రీడాభిమానుల నుంచి బలంగా ఉంది.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..