Hyderabad: కటకటాల్లోకి స్వయం ప్రకటిత విష్ణుమూర్తి! పోలీసుల యాక్షన్ ప్లాన్ ఇదే

నేనే దేవుడ్ని అంటూ సిటీలో కొత్త షెటర్ తెరిచాడు అనంత విష్ణు భగవాన్. ఆ షెటర్ బాగోతం వెనుక సీక్రెట్ ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. పదంటే పది రూపాయలకు సభ్యత్వం ఇచ్చి.. 200 గజాల స్థలం ఇస్తానంటున్నాడు.

Hyderabad: కటకటాల్లోకి స్వయం ప్రకటిత విష్ణుమూర్తి! పోలీసుల యాక్షన్ ప్లాన్ ఇదే
New Baba
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 06, 2022 | 12:06 PM

Telangana: జై మహా భారత్‌ పార్టీ(Jai Maha Bharat Party) అనంత విష్ణు దేవ(Anantha Vishnu Deva)పై ఫోకస్ పెట్టారు పోలీసులు. మెంబర్‌ షిప్‌కి ల్యాండ్ ఆఫర్లు.. ఆ మాటున ఆధార్‌ కార్డ్‌ల సేకరణ ఎందుకు? ఏంటన్న వివరాలపై కూపీ లాగుతున్నారు. అలాగే కేసు నమోదు చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే ఫిర్యాదులెవరూ చేయకపోవడంతో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై న్యాయసలహాలు తీసుకుంటున్నారు. ఫైనల్‌గా సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. నేనే దేవుడ్ని అంటూ హైదరాబాద్‌లో కొత్త దుకాణం తెరిచాడు అనంత విష్ణు దేవ. ఆ షెటర్ బాగోతం వెనుక సీక్రెట్ ఏంటన్నది సస్పెన్స్‌గా మారింది. పదంటే పది రూపాయలకు సభ్యత్వం ఇచ్చి.. 200 గజాల స్థలం ఇస్తానంటున్నాడు. ఇది అయ్యే పనేనా? అసలు సాధ్యమవుతుందా? అన్నది ఆలోచించకుండా మహిళలు పెద్ద ఎత్తున అతని కార్యాలయానికి క్యూ కట్టారు.

జై మహా భారత్‌ పార్టీ అనేది ఒకటుందని ఇప్పటిదాకా జనాలకు తెలియదు. అలాంటి పార్టీకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి? స్థలాలు కొని పేదలకు పంచివ్వడానికి పార్టీ ప్రెసిడెంట్‌ వెనక ఉన్న స్పాన్సర్లు ఎవరు? ఇదంతా పార్టీ ప్రచార ఎత్తుగడా? ఇంకేదైనా కోణం ఉందా అన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈసీకి కూడా పోలీసులు సమాచారమిచ్చారు. తనకు తాను దేవుడిగా ప్రకటించుకున్న అనంత విష్ణు దేవపై బుక్కారం గ్రామస్తులు స్పందించారు. చిన్నతనం నుంచే సేవా స్ఫూర్తితో పనిచేసే వారని వారు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎందుకిలా చేస్తున్నాడన్న దానిపై మాత్రం సమాధానం ఇవ్వలేదు. పార్టీలో చేరాలంటూ జై మహాభారత్‌ కార్యకర్తలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. 3 నెలల్లో 5 లక్షల సభ్యత్వాలు నమోదు టార్గెట్‌గా ముందుకెళ్తున్నారు. అయితే ఆధార్‌ కార్డ్‌లు ఎందుకు అడుగుతున్నారన్నది అంతుపట్టడం లేదు. చాలామంది మహిళలు స్థలం వస్తుందనే ఆశతో ఆధార్ కార్డ్‌ జిరాక్స్‌లు ఇస్తున్నారు. దీనిపైనే పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు.

నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..