ఎయిరిండియా విమానంలో ప్రయాణికుడి మృతి.. సహజ మరణమే అంటున్న సిబ్బంది
నైజీరియాలోని లెగోస్ నుంచి ముంబైకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడు మరణించాడు. ఈ ప్యాసెంజర్ ఒళ్ళంతా వణుకుతూ కనిపించడంతో.. విమాన సిబ్బంది.. ప్రశ్నించగా తనకు..

నైజీరియాలోని లెగోస్ నుంచి ముంబైకి వస్తున్న ఎయిరిండియా విమానంలో ఒక ప్రయాణికుడు మరణించాడు. ఈ ప్యాసెంజర్ ఒళ్ళంతా వణుకుతూ కనిపించడంతో.. విమాన సిబ్బంది.. ప్రశ్నించగా తనకు మలేరియా వ్యాధి ఉన్నట్టు చెప్పాడట..పైగా శ్వాస తీసుకోలేక అవస్థలు పడుతుండడంతో.. సిబ్బంది అతనికి ఆక్సిజన్ ఇఛ్చారు. అయినా కొద్దిసేపటికే ఆయన విమానంలోనే నోటివెంట రక్తం కక్కుకుంటూ మృతి చెందాడు. ఈ విమానం ఆదివారం తెల్లవారు జామున 3.40 గంటలకు ముంబై ఎయిర్ పోర్ట్ చేరుకుంది. ఈ కరోనా కాలంలో ఇంతటి అనారోగ్యం ఉన్న వ్యక్తిని విమానం ఎక్కేందుకు ఎలా అనుమతించారన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. పైగా విమానాశ్రయాల్లో తనిఖీల విషయం లోనూ పలు అనుమానాలు కలుగుతున్నాయి. కాగా ఈ ప్రయాణికుడిది సహజ మరణమే అని ఎయిరిండియా అధికారులు చెప్పడం విశేషం.