ఇక చట్టసభల్లో పెరగనున్న మహిళల ప్రాతినిథ్యం.. బిల్ అవసరం, దాని ముందున్న ప్రతిబంధకాలేంటి..? తెలుసుకుందాం..

Women Reservation Bill: సమాజంలో సగభాగం ఉన్న మహిళలు క్యూలైన్లలో నిలబడి ఓటేసే ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నారు. లింగ వివక్ష అంటూ లేని పరిస్థితిని సృష్టించి జనాభా దామాషా ప్రకారం తగిన వాటా మహిళలకు అందించాల్సిన చోట కనీసం 33 శాతం అందించలేక రిజర్వేషన్ల కోసం పోరాడాల్సిన పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోసారి తెరపైకొచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు నేపథ్యం.. అవసరం.. చరిత్రపై ఓసారి పరిశీలిద్దాం..

ఇక చట్టసభల్లో పెరగనున్న మహిళల ప్రాతినిథ్యం.. బిల్ అవసరం, దాని ముందున్న ప్రతిబంధకాలేంటి..? తెలుసుకుందాం..
Women Reservation Bill
Follow us

| Edited By: శివలీల గోపి తుల్వా

Updated on: Sep 03, 2023 | 6:18 AM

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: కేవలం మగవారికి మాత్రమే సాధ్యం అనుకునే రంగాల్లో సైతం మహిళలు దూసుకెళ్తున్న ఈ రోజుల్లో రాజకీయాల్లో మాత్రం వారికి తగినంత ప్రాతినిథ్యం లభించడం లేదు. ఈ కారణంగానే సమాజంలో సగభాగం ఉన్న మహిళలు క్యూలైన్లలో నిలబడి ఓటేసే ఓటు బ్యాంకుగానే మిగిలిపోతున్నారు. లింగ వివక్ష అంటూ లేని పరిస్థితిని సృష్టించి జనాభా దామాషా ప్రకారం తగిన వాటా మహిళలకు అందించాల్సిన చోట కనీసం 33 శాతం అందించలేక రిజర్వేషన్ల కోసం పోరాడాల్సిన పరిస్థితిలోనే కొట్టుమిట్టాడుతున్నాం. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు మరోసారి తెరపైకొచ్చిన నేపథ్యంలో ఆ బిల్లు నేపథ్యం.. అవసరం.. చరిత్రపై ఓసారి పరిశీలిద్దాం..

కొన్ని రాష్ట్రాల్లో హెచ్చు తగ్గులున్నప్పటికీ దేశంలోని మొత్తం జనాభాలో మహిళలు 48.5 శాతం  ఉన్నారు. 70 కోట్ల మహిళా జనాభాలో మహిళా ఎంపీలు 110 మంది ఉన్నారు. జనాభా దామాషా ప్రకారం సగం ఉండాలని చెప్పకపోయినా.. ఇది ఏమాత్రం సమంజసమైన నిష్పత్తి కాదని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. ఈ పరిస్థితుల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లు ద్వారా రాజకీయాల్లో మహిళలకు తగినంత ప్రాతినిథ్యం అనివార్యంగా కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు గెజిట్ నోటిఫికేషన్ జారీ కావడంతో.. ఈ ఐదు రోజుల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చి పాస్ చేయవచ్చన్న కథనాలు, ఊహాగానాలు నడుస్తున్నాయి.

మహిళా రిజర్వేషన్ బిల్లును సాంకేతికంగా రాజ్యాంగం (108వ సవరణ) బిల్లుగా వ్యవహరిస్తుంటాం. ఈ సవరణ ద్వారా లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం  .. అంటే మూడింట ఒక వంతు సీట్లు మహిళలకు కేటాయించడం జరుగుతుంది. చరిత్రలో.. వర్తమానంలో దేశాధినేతలుగా ఉన్నవారిలో పురుషులదే ఆధిపత్యం కొనసాగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్య రాజకీయాల్లో మహిళలకు ప్రాధాన్యత పెరుగుతున్నప్పటికీ.. ఇప్పటికీ తగినంత ప్రాతినిథ్యం కనిపించడం లేదు. యునైటెడ్ నేషన్స్ ప్రకారం.. 2022 సెప్టెంబర్ 19 నాటికి 28 వేర్వేరు దేశాల్లో 30 మంది మహిళలు ప్రభుత్వాధినేతలుగా పనిచేస్తున్నారు. కేవలం దేశాధినేతలుగా ఉండడమే కాదు.. ఆ పాత్రలో సమర్థతను చాటుకుంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. భారత్‌లో ప్రస్తుతం రాజ్యాంగ పదవుల్లో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ ఉండగా.. ఆనంది బెన్ పటేల్, అనసూయ ఊకే గవర్నర్లుగా ఉన్నారు. 2022 నాటి ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశవ్యాప్తంగా పార్లమెంటుతో పాటు రాష్ట్ర అసెంబ్లీలలో మహిళల ప్రాతినిధ్యం 15 శాతం కంటే తక్కువగా ఉంది. ఇక 19 రాష్ట్రాల శాసనసభల్లో మహిళా శాసనసభ్యులు 10 శాతం లోపే ఉన్నారు. 10 శాతానికి పైగా మహిళా శాసనసభ్యులు ఉన్న రాష్ట్రాల్లో బీహార్ (10.70 శాతం), ఛత్తీస్‌గఢ్ (14.44 శాతం), హర్యానా (10 శాతం), జార్ఖండ్ (12.35 శాతం), పంజాబ్ (11.11 శాతం), రాజస్థాన్ (12 శాతం), ఉత్తరాఖండ్ (11.43 శాతం), ఉత్తరప్రదేశ్ (11.66 శాతం), పశ్చిమ బెంగాల్ (13.70 శాతం), మరియు ఢిల్లీ (11.43 శాతం) ఉన్నాయి. లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిధ్యం 14.94 శాతం కాగా, రాజ్యసభలో 14.05 శాతంగా ఉంది. ప్రస్తుత లోక్‌సభలో మొత్తం 542 మంది సభ్యుల్లో 78 మంది మహిళా సభ్యులు ఉండగా, రాజ్యసభలో మొత్తం 224 మంది సభ్యులుండగా, అందులో 32 మంది మహిళా సభ్యులు ఉన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు చట్ట రూపం తెచ్చుకుని అమలైతే.. లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 179కి చేరుతుంది.

ఇవి కూడా చదవండి

బిల్లు అవసరమేంటి?

దేశంలో తీసుకునే పాలనాపరమైన నిర్ణయాత్మక ప్రక్రియలో మహిళలను భాగస్వాములను చేయడంతో పాటు రాజకీయాల్లో లింగ అసమానతలను తొలగించడం కోసం మహిళా బిల్లును తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలం ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో బిల్లును రూపొందించి ప్రవేశపెట్టి, చర్చకు వచ్చినప్పటికీ ఉభయ సభల ఆమోదం పొందలేకపోయింది. మహిళా రిజర్వేషన్ బిల్లు భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన చర్చనీయాంశంగా మిగిలిపోయింది తప్ప చట్టరూపం సంతరించుకోలేకపోతోంది. దేశ జనాభాలో దాదాపు సగ భాగం ఉన్న మహిళా ఓటర్లను ఆకట్టుకోడానికి ప్రయత్నాలు చేసే రాజకీయ పార్టీలు.. మహిళలకు తగినంత ప్రాతినిథ్యం కల్పించడానికి మీనమేషాలు లెక్కిస్తున్నాయి. దేశంలో ఓటర్లు 1951లో సుమారు 17 కోట్ల మంది ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 94 కోట్లు దాటింది. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో అత్యధికంగా 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. పోలైన ఓట్లలో అత్యధిక శాతం మహిళలే ఉన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో దాదాపు 7,334 మంది పురుషులు పోటీ చేయగా, 715 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం అభ్యర్థుల సంఖ్యతో పోల్చి చూస్తే మహిళా అభ్యర్థులు 9 శాతం మాత్రమే. అయితే ఈ 9 శాతం కూడా గత ఎన్నికలతో పోల్చి చూస్తే గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఏది ఏమైనప్పటికీ, 1952లో జరిగిన మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి 2019 వరకు పార్లమెంట్‌లో పురుషులతో పోల్చితే మహిళా ఎంపీల నిష్పత్తి తక్కువగానే ఉంది.

నివేదికల ప్రకారం, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అత్యధిక శాతం (41 శాతం) మహిళా అభ్యర్థులను నిలబెట్టి ఆధిక్యంలోకి వెళ్లగా, నవీన్ పట్నాయక్‌కు చెందిన బిజూ జనతాదళ్ (బీజేడీ) మహిళలకు 33 శాతం టిక్కెట్లు ఇచ్చి రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ కూడా అత్యధికంగా 54 మంది మహిళా అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 53 మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2019లో బీజేపీ గెలుచుకున్న 303 సీట్లలో 41 మహిళా అభ్యర్థులు గెలవగా.. కాంగ్రెస్ నుంచి సోనియా గాంధీ ఒక్కరే గెలిచారు. అత్యధిక సంఖ్యలో మహిళా ప్రతినిధులతో ఎన్నికైన పార్టీగా బీజేపీ నిలిచింది. 222 మంది మహిళలు స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ వారిలో ఇద్దరు మాత్రమే విజయం సాధించగలిగారు.

ప్రతిబంధకాలేంటి?

మహిళా రిజర్వేషన్ల మార్గంలో అడ్డంకులు అనేకం ఉన్నాయి. రాజ్యాంగం ముందు అందరూ సమానమే అంటున్నప్పుడు మహిళలకు ప్రత్యేకంగా కోటా కల్పించడం అంటే రాజ్యాంగ మౌళిక సూత్రానికి విరుద్ధమన్న వాదన కూడా ఉంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటైన సమానత్వ హక్కును ఇది సవాల్ చేస్తుంది. సమానత్వ హక్కు ప్రకారం లింగ బేధం, భాష, ప్రాంత బేధాలు లేకుండా చూడాలి. కులం ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలవుతున్నప్పటికీ.. మహిళా రిజర్వేషన్లు కులం ఆధారితమైనవి కావు. లింగ బేధాన్ని దృష్టిలో పెట్టుకుని ఇస్తున్నవి కాబట్టి ఇది కచ్చితంగా సమానత్వ హక్కును ఉల్లంఘించేలా ఉందన్న వాదన ఉంది.

మహిళా ఓటర్లను దృష్టిలో పెట్టుకుని గత తొమ్మిదేళ్లలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ల కోసం ఉజ్వల, మహిళల పారిశుద్ధ్య సౌకర్యాల కోసం స్వచ్ఛత, ఇళ్లలో పైప్ ద్వారా తాగు నీటి సరఫరా కోసం జల్-జీవన్ మిషన్ వంటి కార్యక్రమాలను చేపట్టింది. ముస్లిం మహిళలను సైతం తమవైపు తిప్పుకోడానికి ట్రిపుల్ తలాక్ వంటి చట్టపరమైన మార్పులను సైతం తీసుకొచ్చింది. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో సరిపెట్టకుండా మహిళా రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. దేశ ఓటర్ల జాబితాలో సగభాగం ఉన్న మహిళలను ఆకట్టుకోవడంలో ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందని అంచనా వేస్తుంది. రాజకీయ ఎత్తుగడలా దీన్ని బీజేపీ తెరపైకి తెచ్చినప్పటికీ.. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు మహిళా బిల్లును సమర్థించలేక.. వ్యతిరేకించలేక ఇరకాటంలో పడ్డాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
ఎన్డీఏ, ఇండియా కూటములకు మరో అగ్నిపరీక్ష!
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
అదరగొట్టిన భారత్.. బంగ్లాపై తొలి టీ20లో ఘన విజయం..
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
క్యాలీ ఫ్లవర్‌తో ఇలా మసాలా రైస్.. లంచ్ బాక్స్‌కి బెస్ట్!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
జై చిరంజీవ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
టెంపుల్ స్టైల్‌లో చక్కెర పొంగలి ఇలా చేశారంటే మెతుకు కూడా మిగలదు..
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ రోహిణి.. ఇక హౌస్‌లో నవ్వులే నవ్వులు
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
నెలసరి, కీళ్ల నొప్పులకు చెక్ పెట్టాలంటే.. ఈ డ్రింక్ బెస్ట్!
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
అరంగేట్రంలోనే భారీ రికార్డ్.. చరిత్ర సృష్టించిన స్పీడ్‌స్టర్
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
షావోమీ ట్యాబ్‌పై రూ. 23 వేల డిస్కౌంట్‌.. ఈ సేల్‌లో బెస్ట్‌ డీల్‌
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
స్టీల్ ప్లాంట్ సెయిల్‌లో విలీనం చేయాలని పవన్‌ను కోరిన నేతలు
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
ఈ స్టైలిష్ విలన్ భార్య మన టాలీవుడ్ హీరోయిన్ అని తెలుసా.?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
అబ్బా.. సిల్క్.! సగం కొరికిన యాపిల్‌ కే అంత డబ్బు వచ్చిందా..?
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
జైల్లో రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. దర్శన్‌ షాకింగ్ కామెంట్స్
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
మొత్తానికి పబ్లిక్‌గా అసలు విషయం చెప్పాడు.! వీడియో..
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
OTTలో కూడా సుహాస్ స్పీడ్.! అప్పుడే 'గొర్రె పురాణం' ఎక్కడంటే.?
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
నిమిషంలో నవయవ్వనంగా మార్చే మెషిన్‌.! ఉత్తరప్రదేశ్‌లో ఇదే ట్రెండ్.
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
యూట్యూబర్ హర్షసాయి కేసులో దిమ్మతిరిగే ట్విస్ట్! ఎక్కడున్నావ్ బాస్
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
భార్యకు సూపర్ విషెస్‌ చెప్పిన రాక్ స్టార్ మంచు మనోజ్.!
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
జానీ మాస్టర్‌కు భారీ షాక్‌.! నేషనల్ అవార్డు రద్దు.. మరి బెయిల్.?
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.
సారీ చెప్పినా తగ్గని నాగ్ | పవన్ కళ్యాణ్‌పై మధురైలో కేసు నమోదు.