AIADMK Party: శశికళ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన పన్నీర్ సెల్వం.. అన్నాడీఎంకేలో తీవ్ర కలకలం..
AIADMK Party: అన్నాడీఎంకే ముఖ్య నేత, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. జయలలిత నెచ్చెలి..
AIADMK Party: అన్నాడీఎంకే ముఖ్య నేత, తమిళనాడు ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. జయలలిత నెచ్చెలి వి.కె శశిళకపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకేలో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. శశికళ తిరిగి అన్నాడీఎంకేలోకి వస్తానంటే తప్పకుండా ఆలోచిస్తామని బాంబ్ పేల్చారు. శశికళలపై తనకు ఎలాంటి కోపమూ, ద్వేషమూ లేదని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. పార్టీకి సంబంధించి జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పన్నీర్ సెల్వంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నాడీఎంకే వ్యక్తులపై గానీ, కుటుంబాలపై గానీ ఆధారపడదని, పార్టీలోకి ఎవరైనా రావోచ్చు, వెళ్లొచ్చు అని వ్యాఖ్యానించారు. శశికళ మళ్లీ అన్నాడీఎంకేలోకి వస్తానని ప్రతిపాదననలు పంపితే మాత్రం తప్పుకుండా సానుకూలంగానే ఆలోచిస్తామని అన్ నారు. శశికళ అన్నా.. దినకరన్ అన్నా తనకు చాలా గౌరవం ఉందని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. శశికళ తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటే తన ఇష్టమని, నిర్ణయం ఆమెదే అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో పళని స్వామితో విబేధాల కారణంగానే మీరు ఇలా కామెంట్స్ చేస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. తనకు, సీఎం పళని స్వామికి ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. పళని స్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని ప్రతిపాదించిన వారిలో తానూ ఒకరిని అని గుర్తు చేశారు.
ఇదిలాఉంటే.. శశికళను అన్నాడీఎంకేలోకి చేర్చుకునే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి పళని స్వామి గతంలో తేల్చి చెప్పారు. శశికళ జైలు నుంచి విడుదలైన సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. శశికళ ఆటలు అన్నాడీఎంకేలో సాగవని స్పష్టం చేశారు. అంతేకాదు.. ఆమె తమిళనాడులోకి ఎంటర్ అవడంతోనే ఆమె బంధువులపై వరుసగా ఏసీబీ అధికారులతో దాడులు చేయించారు సీఎం పళని స్వామి. అలాగే ఆమె ఆస్తులు కూడా జప్తు చేయించారు. చివరికి శశికళ.. తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇలాంటి నేపథ్యంలో పన్నీర్ సెల్వం తాజా కామెంట్స్ తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పళనితో ఉన్న విభేదాల కారణంగానే పన్నీర్ సెల్వం శశికళకు సపోర్ట్‌గా మాట్లాడి ఉంటారని తమిళ రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరికొందరైతే.. శశికళ, దినకరన్‌ను మచ్చిక చేసుకోవడం ద్వారా ముఖ్యమంత్రి పదవి పొందవచ్చునని భావించే పన్నీర్ సెల్వం ఈ రకమైన పొలిటికల్ కామెంట్స్ చేస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Also read:
West Bengal Election 2021: బెంగాల్ దంగల్.. ఏ పార్టీది విజయం?.. సర్వేలు ఏం చెబుతున్నాయి?..