Amazon: మొబైల్ కోనుగోలుదారులకు బంపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఉచితంగా పొందండి.. అదెలాగంటే..
One Plus Phone Offer: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసిన..
One Plus Phone Offer: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లను భారత్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 5 జీ నెట్‌వర్క్ సపోర్ట్, హాసెల్‌బ్లాడ్ కెమెరా కలిగిన ఈ వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లకు దేశ వ్యాప్తంగా విపరీతమై డిమాండ్ వస్తోది. 9 సిరీస్‌లో భాగంగా కంపెనీ వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9ప్రో, వన్‌ప్లస్ 9 ఆర్‌లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటి ప్రారంభ ధర రూ. 39,999, రూ. 43,999, రూ. 69,999 వేలుగా ఉంది. సరికొత్త ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్లు ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుంది. అమెజాన్, ఫ్లి్ప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో వన్‌ప్లస్ సిరీస్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. కాగా, కస్టమర్లకు వన్‌ప్లస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. తాము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పండి.. వన్‌ప్లస్ సిరీస్ ఫోన్లను ఉచితంగా పొందండి అంటూ క్విజ్ కాంపిటేషన్ పెడుతోంది.
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజమైన అమెజాన్‌లో క్విజ్ పోటీలను ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. ‘స్పిన్ అండ్ విన్’, ‘క్వశ్చన్ అండ్ ఆన్సర్’ పేరిట గత కొంతకాలంగా క్విజ్ కాంపిటేషన్ నిర్వహిస్తోంది. తాజాగా మార్కెట్‌లోకి విడుదలైన వన్‌ప్లస్ సిరీస్‌పైనా ఈ క్విజ్ పోటీలు పెట్టారు. దీనికి వన్‌ప్లస్ స్పాన్సర్ చేస్తోంది. అయితే, ఈ క్విజ్‌లో భాగంగా వన్‌ప్లస్ సిరీస్ ఫోన్లకు సంబంధించి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు అడుగుతారు. అలా అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన వారిలో కొందరిని విజేతలుగా ఎంపిక చేస్తారు. ఈ క్విజ్ కాంపిటేషన్‌లో గెలిచిన వారికి వన్‌ప్లస్ 9 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను బహుమతిగా అందజేస్తారు. కాగా, ఈ క్విట్ ప్రస్తుతం స్టార్ట్ అవగా.. ఏప్రిల్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇక ఈ క్విజ్ అమెజాన్ యాప్‌లో అందుబాటులో ఉంది.
Also read:
Worlds Deadliest Animal: అందంగా ఉంది కదా అరచేతిలో పెట్టుకుంది.. జస్ట్ మిస్ ప్రాణాలతో బయటపడింది..