Election Campaign: ఎన్నికల ప్రచారంలో రెచ్చిపోయిన నేత.. డ్రమ్ముల్లా మారుతున్నారంటూ మహిళలను కించపరుస్తూ కామెంట్స్..
Tamil Nadu Elections 2021: తమిళనాట ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు...
Tamil Nadu Elections 2021: తమిళనాట ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా కొద్ది ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తమ ప్రచారాన్ని మరింత వేగవంతం చేశారు. ఊరు, వాడా తిరుగుతూ ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. అయితే, ఈ ప్రచారం సందర్భంగా డీఏంకే నేత దిండిగుల్ లియోన్ తీవ్రమైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. మహిళలు కించపరిచేలా కామెంట్స్ చేశాడు. మహిళలు విదేశీ ఆవుల పాలు తాగడం వల్ల డ్రముల్లాగా మారుతున్నారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అసలేం జరిగిందంటే.. డీఎంకే ప్రచార కార్యదర్శి అయిన దిండిగుల్ లియోన్.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ డీఎంకే అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా.. తొండముథుర్ డీఎంకే అభ్యర్థి కార్తికేయ శివసేనాపతి తరఫున దిండిగుల్ లియోన్ ఈ నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, శివసేనాపతి స్థానిక పశువుల సంక్షేమం కోసం పనిచేస్తున్న ఎన్జీఓ సంస్థ ‘సేనాపతి కంగయం పశువుల పరిశోధన ఫౌండేషన్’ మేనేజింగ్ ట్రస్టీ. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలలనే ఉద్దేశంతో ప్రసంగించిన దిండిగల్ లియోన్.. చివరికి కాంట్రవర్సి కామెంట్స్ చేశారు.
‘‘మన వద్ద చాలా రకాల ఆవులు ఉన్నాయి. మన వ్యవసాయ క్షేత్రాల్లో విదేశీ ఆవులు కూడా ఉన్నాయి. ఈ ఆవులకు చాలా డిమాండ్ ఉంది. పాలు పితకడం కోసం వాటికి మిషిన్లను ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి స్విచ్ వేయగానే.. గంటలోపలు 40 లీటర్ల పాటు పితుకుతాయి. ఈ విదేశీ ఆవుల పాలు తాగి మన వద్ద మహిళలు బెలూన్‌లా ఉబ్బిపోతున్నారు. గతంలో మహిళలు ‘8’ ఆకారంలో ఉండేవారు. ఇప్పుడు డ్రమ్ముల్లా మారిపోతున్నారు. గతంలో పిల్లలను అలవోకగా నడుమొంపుల్లో ఎత్తుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. విదేశీ ఆవుపాలు తాగి మహిళలు లావుగా తయారవుతున్నారు. పిల్లలు కూడా అలాగే మారిపోతున్నారు.’’ అంటూ దిండిగుల్ లియోన్ మహిళలపై జుగుస్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దిండిగుల్ మాట్లాడుతున్న సమయంలో ఆయనను నిలువరించేందుకు పక్కన ఉన్న నేతలు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆయన తన మనసులోని భావాలన్నింటినీ వ్యక్తపరిచారు. అయితే దిండిగల్ లియోన్ ప్రసంగానికి సంబంధించి వీడియోను పలువురు సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడది తమిళనాట పెనుదుమారం రేపుతోంది. మహిళలను అవమానిస్తారా? అంటూ ధ్వజమెత్తుతున్నారు నెటిజన్లు.
DMK Leader Election Campaign:
.@KanimozhiDMK Madame please get rid of womanizers like Dindigul Leoni, Vairamuthu etc in your party before you talk about women’s safety.. pic.twitter.com/cVkGCQ8eGi
— Vishwatma ?? (@HLKodo) March 24, 2021
Also read:
Worlds Deadliest Animal: అందంగా ఉంది కదా అరచేతిలో పెట్టుకుంది.. జస్ట్ మిస్ ప్రాణాలతో బయటపడింది..