Tamil Nadu Assembly elections: తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు.. సెటైర్ గుప్పిస్తున్న పార్టీల నేతలు
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకా రెండు వారాలే గడువు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సేలం జిల్లాలో ప్రచారం చేశారు. ఆతూర్ ప్రాంతంలో ఇంటింటికీ...
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలుతున్నాయి. ఇంకా రెండు వారాలే గడువు. డీఎంకే చీఫ్ స్టాలిన్ సేలం జిల్లాలో ప్రచారం చేశారు. ఆతూర్ ప్రాంతంలో ఇంటింటికీ తిరిగి ఓటు వేయాలని కోరారు. పళని స్వామి బల్లి,పాములా పాకుతూ ముఖ్యమంత్రి అయ్యారని సెటైర్ వేశారు. ఆయన ఆ రెంటి కంటే విషపూరితం అన్నారు స్టాలిన్.
కరూరులో మంత్రి విజయ్ బాస్కర్ తరపున ఎన్నికల ప్రచారం చేశారు సీఎం పళని స్వామి. ఈ ఎన్నికలు డూప్లికేట్లకు ఐఎస్‌ఐ మార్క్ ఉన్న అభ్యర్థులకు పోటీగా ప్రకటించారు. పాలిటిక్స్‌కి రిటైర్‌మెంట్ ప్రకటించిన శశికళకు కొత్త ఆఫర్ ఇచ్చారు పన్నీర్ సెల్వం.
ఆమె పార్టీలోకి తిరిగి వస్తామంటే.. ఆలోచిస్తామని.. అయితే తాము చెప్పినట్లు వింటేనే అని షరతు విధించారు. అన్నాడీఎంకే ప్రస్తుతం కో ఆర్డినేటర్, డిప్యూటీ కో ఆర్డినేటర్ కనుసన్నల్లో నడుస్తోంది. శశికళ ఈ తరహా సెటప్‌కు అంగీకరిస్తేనే ఆమె పార్టీలోకి వచ్చే విషయం ఆలోచిస్తామన్నారు ఓపీఎస్.
ఇక ఎన్నికల వీడియో ఒకటి మక్కల్ నీది మయ్య – డీఎంకే మధ్య వివాదం రేపుతోంది. తమ పార్టీకి ఓటు వేయాలంటూ కమల్ హాసన్ విడుదల చేసిన వీడియోను.. చివర్లో కాస్త ఎడిటింగ్ చేసి డీఎంకే ప్రచారం చేసుకుంటోంది. ఇందులో కమల్ బీజేపీపై సూటిగా ఘాటు విమర్శలు చేశారు. తమిళనాడులో చీకటి పోవాలంటే టార్చ్‌లైట్ వెలగాలని కమల్ చెబితే.. చీకటిపోవాలంటే సూర్యుడు రావాలంటూ డీఎంకే ప్రచారం చేసుకుంటోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ వీడియోని డీఎంకే కాపీ కొట్టడంపై కమల్‌హాసన్‌తో పాటు ఎంఎన్‌ఎం కార్యకర్తలు తప్పు పడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల ప్రకటన తర్వాత తమిళనాడులో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది.
కోయంబత్తూరులో రోడ్డు పక్కన పోలీసులు కోటి రూపాయల పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కారు వద్ద గొడవ పడుతున్న సమయంలో పోలీసులు అక్కడకు రావడంతో.. కారులో వ్యక్తులే నగదు విసిరేసి పారిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో ప్రతీ రోజూ అక్రమంగా తరలిస్తున్న బంగారం దొరుకుతోంది.
విదేశాల నుంచి తెస్తున్న ఐదున్నర కేజీల బంగారం, 24 లక్షల రూపాయల నగదుని అధికారులు పట్టుకున్నారు. తాజాగా హైదరాబాద్‌లో దొరికిన పాతిక కేజీల బంగారం, నగదుకీ తమిళనాడు ఎన్నికలకు సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: DSC Notification: టీచర్ ఉద్యోగార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. త్వరలోనే డీఎస్సీ..