Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెప్పండీ.. తమిళ తంబీలు.. వాట్‌ టు డూ.. వాట్‌ నాట్‌ టు డూ.. అంటూ నేతల బంపర్‌ ఆఫర్లు..

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు.. వినూత్న ఆలోచనలు, బంఫర్‌ ఆఫర్లతో ఇమేజ్‌ను పెంచేసుకుంటున్నారు నేతలు....

చెప్పండీ.. తమిళ తంబీలు.. వాట్‌ టు డూ.. వాట్‌ నాట్‌ టు డూ.. అంటూ నేతల బంపర్‌ ఆఫర్లు..
Thanga Kathiravan From Nagapattinam Washed People’s Clothes
Follow us
Phani CH

|

Updated on: Mar 24, 2021 | 8:05 PM

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఓటర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు.. వినూత్న ఆలోచనలు, బంఫర్‌ ఆఫర్లతో ఇమేజ్‌ను పెంచేసుకుంటున్నారు నేతలు. అంతేకాదు.. చెప్పండీ.. తమిళ తంబీలు.. వాట్‌ టు డూ.. వాట్‌ నాట్‌ టు డూ.. అంటూ ఓటర్లకే ఛాన్స్‌ ఇస్తున్నారు నేతలు. ఇక ఇంకొందరు నేతలు మాత్రం.. చిత్ర, విచిత్ర వాగ్దానాలు, హామీలు ఇస్తూ సెంటర్‌ ఆఫ్‌ ఏట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. రోడ్లు ఊడవడం నుంచి.. బట్టలు ఉతకడం, చిన్న పిల్లలకు స్నానం చేపించడం.. అబ్బో చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్నో. సినిమా సీన్లకు తలపించే విధంగా.. ప్రచారం చేస్తూ.. ఓటర్ల దృష్టిని ఆకర్శించే పనిలో బిబీబిజీగా ఉన్నారు నేతలు. ఇక తాజాగా నాగపట్నం నియోజకవర్గంకు చెందిన AIADMK అభ్యర్థి కతిరావన్‌.. ప్రచారంలో భాగంగా.. రోడ్డుపై కూర్చుని బట్టలు ఉతికి అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు.

ఓ మహిళ బట్టలు ఉతకడం చూసిన కతిరావన్‌.. వెంటనే ఆ మహిళ వద్దకు చేరుకుని.. నేను ఉతుకుతానంటూ సూచించాడు. అందుకు మొదట్లో సదరు మహిళ ఒప్పుకోలేదు. కానీ.. కతిరావన్‌ మాత్రం.. ఆమెను అక్కడి నుంచి తప్పించి మరీ.. రోడ్డుపైనే కూర్చుని బట్టలు ఉతికాడు. ఆయన వెంబడ ఉన్న మరికొంత మంది కార్యకర్తలు ఆయనకు సహాయం చేశారు. అంతేకాదు.. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. ప్రతీ ఇంటికి ఒక వాషింగ్‌ మెషీన్‌ ఇస్తుందని హామీ కూడా ఇచ్చారు. ఇక కతిరావన్‌ చేసిన హడాహూడికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

ఇక తమిళనాడుకు చెందిన డీఎండీకే పార్టీ అధినేత విజయ్‌కాంత్‌ భార్య ప్రేమలత కరోనా పరీక్ష చేయించుకోకుండా ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. దీంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయితే ప్రచారం భాగంగా.. ఆమె ఓ చంటి పిల్లడిని ఎత్తుకుని మరీ ఫోటోలకు ఫోజులిచ్చారు. కొద్ది రోజుల క్రితం ప్రేమలత సోదరుడు, ఆయన భార్యకు ఇటీవల కరోనా సోకింది. విజయ్‌కాంత్‌ సోదరుడికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారితో కలిసి ఉన్న ప్రేమలతను కరోనా పరీక్ష చేయించుకోవాలని వైద్యసిబ్బంది సూచించారు. అయినప్పటికీ బుధవారం ఆమె ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆమె ఇప్పటి వరకు కరోనా పరీక్షలు చేయించుకోకుండా.. ప్రచారం చేయడంపై మండిపడుతున్నారు ప్రతిపక్షనేతలు.

మరిన్ని ఇక్కడ చదవండి: ఢిల్లీ బిల్లుపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్షాల ఆగ్రహం, ఆర్థిక మంత్రి ప్రసంగానికి అంతరాయం

వినియోగదారులకు షాక్ ఇచ్చిన వోడాఫోన్ ఐడియా.. ఆ రీఛార్జ్ ధరలను భారీగా పెంచిన టెలీకాం సంస్థ..